ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పుష్పక విమానం’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతుంది. కాగా ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. బాలీవుడ్ నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ చిత్రం రీమేక్ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారు. కొత్త తరహా కథలో కామెడీ, మిస్టరీ కలిసి వున్న ఈ చిత్రం బాలీవుడ్లో కూడా మంచి ఆదరణ పొందుతుందని సదరు నిర్మాణ సంస్థలు భావిస్తున్నాయి. ఈ రీమేక్ హక్కులకు సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత అనురాగ్ పర్వతనేని తెలిపారు.