Walking | న్యూఢిల్లీ: ఆరోగ్యమే మహా భాగ్యమని, మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం మంచి ఆహారాన్ని తీసుకోవడంతోపాటు తగినంతసేపు వ్యాయామం చేయడం కూడా ముఖ్యమేనని పెద్దలు ఎప్పుడూ చెప్పే మాటే. మనం ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండాలంటే రోజూ అదనంగా ఒక గంటపాటు నడవాలని, దీని వల్ల మన ఆయుర్దాయం మరో 6 గంటలు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
యాక్టివ్‌గా ఉండేవారి కంటే చురుకుదనం లోపించిన వారికే అదనపు నడక వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఫిట్నెస్ ట్రాకర్ల ద్వారా సేకరించిన డాటా స్పష్టం చేసినట్టు ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం వెల్లడించింది. యాక్టివ్‌గా ఉండేవారికి అదనపు నడకతో పెద్దగా ఒరిగేదేమీ ఉండదని, వారి వ్యాయామం ఇందుకు కారణమని ఆ బృందం తెలిపింది.