ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రానికి ఓ ప్రత్యేకాకర్షణ తోడైంది. బాలీవుడ్ అగ్ర నటుడు, బిగ్‌బి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించారు. హృద్యమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రానికి అమితాబ్‌బచ్చన్ నేపథ్య గళం చక్కటి అలంకారంగా భాసిల్లుతుందని దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ‘అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమా కథకు నెరేటర్‌గా మారిపోవడం చాలా సంతోషంగా ఉంది.
1970 దశకంలో ఇటలీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. యూరప్‌లోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. పాటలకు మంచి స్పందన లభిస్తున్నది’ అని చిత్రబృందం తెలిపింది. పూజాహెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ఖేడ్కర్, ప్రియదర్శి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్‌పరమహంస, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, సమర్పణ: గోపీకృష్ణమూవీస్, నిర్మాణం: యూవీ క్రియేషన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.కె.రాధాకృష్ణకుమార్.