బాలీవుడ్ దిగ్గజ నటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో తన ఎత్తు, ముఖాకృతి అవకాశాలపరంగా అడ్డంకిగా మారాయని తెలిపారు. ‘ఎత్తు బాగా ఉండటంతో నాతో ఏ హీరోయిన్ నటించదని దర్శకనిర్మాతలు భయపెట్టేవారు. అలాగే శరీరంతో పోల్చితే ముఖం చాలా చిన్నగా కనిపిస్తుందని విమర్శించేవారు. దాంతో బాగా ఆలోచించి జుట్టు పెంచాలని నిర్ణయం తీసుకున్నా.
దాంతో నా ముఖం కాస్త నిండుగా కనిపించింది’ అని అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. అయితే విమర్శల కారణంగా మార్చుకున్న ఆ లుక్..అనంతరకాలంలో అమితాబ్‌బచ్చన్‌కు తిరుగులేని క్రేజ్ తీసుకొచ్చింది. 1970 దశకంలో పొడవాటి జుట్టు, సైడ్బర్న్స్ యువతలో ఫ్యాషన్‌గా మారాయి. అప్పటి ఆయన ైస్టెల్ యూత్‌ని ఉర్రూతలూగించింది. లోపాలుగా భావించిన అంశాలనే తన బలాలుగా మార్చుకొని ఎదిగానని, మనందరి జీవితాల్లో ఇలాంటి మార్పు సాధ్యమేనని అమితాబ్‌బచ్చన్ పేర్కొన్నారు.