కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిస్సింగ్!.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మిస్సింగ్!.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు | కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తప్పిపోయారా?.. వాస్తవానికి అలాంటిదేమీ లేదు. కానీ, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), ట్విట్టర్ ప్రకారం ఆయన ఆచూకీ తెలియడం లేదంతే.

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పిపోయారా?.. వాస్తవానికి అలాంటిదేమీ లేదు. కానీ, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), ట్విట్టర్ ప్రకారం ఆయన ఆచూకీ తెలియడం లేదంతే. ప్రస్తుతం ‘అమిత్ షా మిస్సింగ్’ యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెడవుతోంది. దేశం కరోనా మహమ్మారితో పోరాడుతుండగా హెచ్ఎం (హోం మినిష్టర్) ‘ఎంఐఏ’ (మిస్సింగ్ ఇన్ యాక్షన్) అంటూ పలువురు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. కాగా, ఢిల్లీ పోలీసులు బుధవారం జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేశ్ కరియప్ప దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఎన్ఎస్యుఐ కార్యాలయాన్ని సందర్శించారు. ‘ప్రస్తుతం పౌరులు సంక్షోభంలో ఉన్నారు.. అమిత్ షా మహమ్మారి మధ్య అదృశ్యమయ్యారు’ అని ఆరోపించారు. రాజకీయ నాయకులు దేశానికి సేవ చేయాల్సి ఉందని, సంక్షోభ పరిస్థితుల్లో నుంచి పారిపోకూడదని విద్యార్థి నాయకుడు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో.. భారత ప్రభుత్వం, బీజేపీకి మాత్రమే కాకుండా దేశ ప్రజలకు జవాబుదారీగా ఉండడం రాజకీయ నాయకుల కర్తవ్యం అని పేర్కొన్నారు.
Name : Amit shah
— Nagesh Kariyappa 🇮🇳 (@Nagesh_nsui6) May 12, 2021
Designation : Home Minster of India
Last seen : During Bengal
election campaigns.
Missing Complaint registered with @DelhiPolice #AmitShahMissing pic.twitter.com/nX7mKP3nLB
ఇవి కూడా చదవండి..
తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య తగ్గని ఉద్రిక్తతలు.. దాడుల్లో 72 మంది మృతి
అమెరికాలో భారీగా తగ్గిన కరోనా మరణాలు
తమిళనాడు రసాయన పరిశ్రమలో ప్రమాదం.. నలుగురు మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

