Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Hyderabad | హైదరాబాద్‌లో ఓ అమెరికా పౌరుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినస్ భవనంలోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్స్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Hyderabad | హైదరాబాద్‌లో ఓ అమెరికా పౌరుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినస్ భవనంలోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్స్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ బ్రియాన్ లీ (41) తన వ్యాపార భాగస్వామి డేవిడ్ వూతో కలిసి నవంబర్ 2న వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చాడు. ఇద్దరూ గచ్చిబౌలిలోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో బస చేశారు. హోటల్ 12వ అంతస్తులోని 1218 నంబర్ గదిలో మిచెల్ ఉండగా.. డేవిడ్ మరో గదిలో దిగాడు.
నవంబర్ 4 సాయంత్రం నుంచి మిచెల్ గది నుంచి బయటకు రాకపోవడంతో పాటు ఫోన్ కాల్స్‌కు స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన డేవిడ్ హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వారు మాస్టర్ కీతో గది తలుపులు తెరిచి చూడగా మంచంపై అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా.. వారు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు.
ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి కారణం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

