RGV | ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ సంచలనంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అమెరికా – ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయన చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణను ఆయన కేవలం రాజకీయ పోరాటంగా కాకుండా, “జీసస్ మరియు అల్లా మధ్య జరుగుతున్న యుద్ధం”గా అభివర్ణించాడు. అంతేకాకుండా, ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే తాను ఆ మతంలోకి మారిపోతానంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
నిజానికి వర్మ ఒక నాస్తికుడి అన్న సంగతి తెలిసిందే. అయితే మతపరమైన నమ్మకాలపై తరచుగా ఇలాంటి సెటైర్లు వేస్తుంటారు. ప్రపంచ దేశాల మధ్య జరిగే గంభీరమైన అంశాలను కూడా ఆయన తనదైన తార్కిక కోణంలో విశ్లేషిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ప్రస్తుతం మీడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.
The fight between AMERICA and IRAN is the fight between JESUS and ALLAH.. whoever wins I will CONVERT to that 💪💪💪
— Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2026