హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు (ఓల్డ్ బ్యాచ్) మొదటి సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 28 నుంచి 31 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు జనవరి 3 నుంచి 8, 2022 వరకు, మూడో సంవత్సరం పరీక్షలు జనవరి 17 నుంచి 22, 2022 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
పరీక్ష సమయం మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 గం.ల వరకు అని పేర్కొన్నారు. ఆన్లైన్లో ఫీజు చెల్లింపు తదితర వివరాలను www.braouonline.in లో పొందొచ్చన్నారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ డిసెంబర్ 2 గా తెలిపారు. హాల్ టికెట్స్ పరీక్ష తేదికి రెండు రోజులు ముందు www.braou.ac.in లో డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 040-23680241/254 ఫోన్ నెంబర్లలో సంప్రదించొచ్చని పేర్కొన్నారు.