e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News భారత్‌లో అమెజాన్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు

భారత్‌లో అమెజాన్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ త్వరలో భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించబోతున్నట్టు మీడియా వార్తలు వెలువడ్డాయి. మనదేశంలో 75 శాతం గ్రామాలకు సెల్యులర్, ఫైబర్ కనెక్టివిటీ లేని కారణంగా ఇంటర్నెట్ సేవల విస్తరణకు ఆటంకం కలుగుతున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ముందుకు తెచ్చే ప్రయత్నాలు జురుగుతున్నాయి. అంటే సెల్ టవర్స్, కేబుల్ లేకుండానే నేరుగా శాటిలైట్ నుంచి వినియోగదారులు డేటా సేవలు పొందవచ్చునన్నమాట. ప్రస్తుతం వన్‌వెబ్, స్పేస్-ఎక్స్ కంపెనీలు శాటిలైట్ ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తున్నాయి. ప్రారంభ దశలో రేట్లు ఎక్కువగానే ఉంటాయి. మామూలు సెల్ నెట్ రేట్ల కన్నా 30 రెట్లు అధికంగా ఉన్నాయి. రానురాను రేట్లు తగ్గుతాయి. అమెజాన్ రంగంలోకి వస్తే తగ్దుదల భారీగా ఉంటుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవల కోసం అమెజాన్ వెయ్యికోట్ల డాలర్లతో (సుమారు రూ.72,500 కోట్లు) ప్రాజెక్టు కుయిపర్ చేపట్టింది. దీనికింద భూమికి తక్కువ ఎత్తులో 3,236 చిన్నచిన్న శాటిలైట్లు ఏర్పాటు చేయబోతున్నది. వాటిద్వారా వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ నేరుగా డేటా అందుతుంది. భార్తి ఎయిర్‌టెల్ వత్తాసుతో వన్‌వెబ్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్-ఎక్స్ భారత్ లో శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలు ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఇదివరకే ప్రకటించాయి. అమెజాన్ ఆ దిశగా సాగుతున్నట్టు తెలుస్తున్నది. అధికారికంగా అమెజాన్ నుంచి ఇంకా ఈ వార్తలపై ధ్రువీకరణ వెలువడలేదు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement