Amazon | 23న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
సెప్టెంబర్ 23న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుందని ఈకామర్స్ దిగ్గజం వెల్లడించింది. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోం, కిచెన్ అప్లయెన్సెస్, టీవీలు, గ్రాసరీ సహా అన్ని విభాగాల్లో మెగా ఫెస్టివల్ సేల్‌లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.
న్యూఢిల్లీ : సెప్టెంబర్ 23న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమవుతుందని ఈకామర్స్ దిగ్గజం వెల్లడించింది. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోం, కిచెన్ అప్లయెన్సెస్, టీవీలు, గ్రాసరీ సహా అన్ని విభాగాల్లో మెగా ఫెస్టివల్ సేల్‌లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై పదిశాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను అమెజాన్ ఆఫర్ చేయనుంది.
ఐఫోన్ 13, ఐక్యూ00 9టీ వంటి ఇతర ప్రీమియం ఫోన్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుందని భావిస్తున్నారు. యాపిల్ ఇటీవల ఐఫోన్ 14ను లాంఛ్ చేయడంతో ఐఫోన్ 13 ఫోన్ ధర తగ్గుతుందని అంచనా. ఐఫోన్ 13 రూ 53,000 నుంచి 54,000 మధ్యన లభిస్తుందని టెక్ నిపుణులు అభిషేక్ యాదవ్ అంచనా వేశారు.
బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో ధర తగ్గుతుందని చెబుతున్నారు. దీనికి తోడు కొనుగోలుదారులు తమ పాతఫోన్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఇక రియల్‌మి, షియామి, వన్‌ప్లస్ వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపైనా అమెజాన్ ఫెస్టివ్ సేల్‌లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని అంచనా. గెలాక్సీ ఫోల్డ్ సిరీస్, రెడ్మి ఫోన్ 11 5జీ వంటి లేటెస్ట్ లాంఛ్ అయిన స్మార్ట్ఫోన్లను అమెజాన్ విక్రయించనుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ఈ నెలాఖరులో షురూ కానుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

