అల్లం టీతో ఆస్తమాకు గుడ్‌బై.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు
అల్లం టీ | అల్లంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఒక కప్పు అల్లం టీని తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది.

అల్లం మసాలా దినుసు మాత్రమే కాదు, అల్లంతో అనేక ఉపయోగాలున్నాయి. అల్లంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఒక కప్పు అల్లం టీని తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది.
ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టాలంటే అల్లం టీ రోజూ తేనెతో కలిపి తీసుకోవాలి. అల్లం టీ వల్ల రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. అల్లంలో ఉండే ఖనిజ లవణాలు గుండెకు మేలు చేస్తాయి.
హృదయ కవాటాల్లో రక్త సరఫరా సక్రమంగా ఉండటానికి దోహదపడతాయి. హృద్రోగాలూ దూరంగా ఉంటాయి. నెలసరి సమస్యలూ అదుపులోకి వస్తాయి.
టీ తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికశాతం అందుతాయి. రోగనిరోధక శక్తి పెరిగి, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే అరోమా గుణాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి. అల్లం టీ ఉదయం తాగితే రోజంతా హుషారుగా ఉంచుతుంది. అల్లం టీని సేవించడం ద్వారా గర్భిణీలకు ఎంతో మేలు చేకూరుతుందట.
వేవిళ్లకు చెక్ పెట్టడంలో అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. సాధారణ టీలో అల్లం బిస్కెట్లు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఛాతీలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం టీ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు దరిచేరవు. మోకాళ్ల వాపులు కూడా అల్లం టీ రోజూ తీసుకుంటే తగ్గిపోతాయి. అలాగే ఏ అనారోగ్యంతో బాధపడేవారు అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది.
జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధ పడేవారు అల్లం టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
పొద్దు తిరుగుడు విత్తనాలను రోజూ తింటే..?
కిడ్నీ స్టోన్లు ఉన్నాయని తెలిపే లక్షణాలు ఇవే..!
బ్లూ టీ గురించి మీకు తెలుసా..? దాంతో కలిగే లాభాలివే..!
అంజీర్ పండ్లతో శృంగార సమస్యలకు చెక్..!
కొంబుచా టీ తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

