కొంబుచా టీ తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?

మనకు తాగేందుకు అందుబాటులో ఉన్న అనేక రకాల టీలలో కొంబుచా టీ కూడా ఒకటి. ఇది రష్యాలో మొదటి సారిగా తయారు చేయబడిందని చెబుతారు. కానీ దానికి సరైన ఆధారాలు లేవు. కొన్ని వందల ఏళ్ల నాటి నుంచే ఈ టీని అనేక దేశాల్లోని పలు వర్గాలకు చెందిన ప్రజలు సేవిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే పలు ఇతర దేశాలకూ ఈ టీ రుచి తెలిసింది. అందుకే ఈ టీని తాగేందుకు ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొంబుచా టీని నిత్యం తాగడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కొంబుచా టీలో పాలు, పాల సంబంధ పదార్థాలలో ఉండే పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ టీలో ఉండే ప్రొ బయోటిక్స్ మన జీర్ణాశయం, పేగుల్లో ఉండే మంచి బాక్టీరియా సంఖ్యను పెంచుతాయి. దీంతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి.
గ్రీన్ టీ లాగే కొంబుచా టీలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.
కొంబుచా టీని నిత్యం తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం బాగా తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ టీని నిత్యం సేవిస్తే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో అధిక బరువు కూడా తగ్గుతారు.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం కొంబుచా టీని తాగితే మంచిది. వారి రక్తంలో ఉండే షుగర్ స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కొంబుచా టీలో ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- benefits
- kombucha-tea
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

