నిద్రపట్టట్లేదా.. ఈ పండ్లు తినండి!
plum fruits | రక్తంలో చెక్కెర శాతం అదుపులో ఉంచేందుకు అల్బుకరా పండ్లు సహాయపడతాయి. వీటిలోని విటమిన్-బి, విటమిన్-సి జుట్టు పొడిబారుట, రాలిపోవుట, చిగుళ్లు చిట్లిపోవుట లాంటి సమస్యల నుంచి కాపాడతాయి.

మిగతా అన్ని రకాల పండ్లతో పోల్చితే ఆల్బుకరా పండు చాలా ప్రత్యేకమైనది. ఇది చూడటానికి ఎరుపు, నలుపు రంగులు కలిసి ద్రాక్ష, యాపిల్ పండ్లను పోలినట్లు కనిపిస్తుంది. అలాగే రుచిలో కూడా కాస్త తియ్యగా.. కాస్త పుల్లగా ఉంటుంది. వీటిని నేరుగా పచ్చిగా తినేయచ్చు లేదా ఎండబెట్టి కూడా తినచ్చు. చాలా మంది ఇష్టంగా తినకపోయినప్పటికీ ఆల్బుకరా పండు అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుందంటున్నారు నిపుణులు. ఆల్బుకరా పండ్లలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది ప్రేగులను శుభ్రం చేసి వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు డ్యామేజ్ అయిన కణాలు తిరిగి పుంజుకునేందుకు సహాయపడతాయి. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు కనపడకుండా ఉంటాయి. ఎండబెట్టిన ఆల్బుకరాలు మంచి స్నాక్స్ లాగా పనిచేస్తాయి.
ఆల్బుకరా పండ్లను తినడం వల్ల శరీరంలో కొవ్వుతో పాటు రక్త పోటు కూడా అదుపులో ఉంటాయి.
ఎముకల సాంద్రతను పెంచే పోషకాలు ఆల్బుకరా పండ్లలో పుష్కలంగా ఉంటాయి.
ఆల్బుకరా పండ్లలో సహజంగా లభించే మెగ్నీషియం, మంచిగా నిద్ర పట్టేలా చేస్తుంది.
ఐరన్ లోపంతో బాధపడుతున్నవారికి ఆల్బుకరా పండ్లు బాగా సహాయపడతాయి. వీటిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది.
ఆల్బుకరా పండ్లలో పుష్కంగా లభించే బొరొన్ కండరాల గాయాలను నయం చేసేందుకు ఉపయోగపడుతుంది.
రక్తంలో చెక్కెర శాతం అదుపులో ఉంచేందుకు ఆల్బుకరా పండ్లు సహాయపడతాయి.ఆల్బుకరా పండ్లలోని విటమిన్-బి, విటమిన్-సి జుట్టు పొడిబారుట, రాలిపోవుట, చిగుళ్లు చిట్లిపోవుట లాంటి సమస్యల నుంచి కాపాడతాయి.
ఇవి కూడా చదవండి..
ఈ పొడితో నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు తెలుసా?
బట్టలు తెల్లగా మెరవాలా? ఇలా ట్రై చేయండి
మట్టికుండల్లో నీరే మంచిది.. ఎందుకంటే..?
వేసవి తాపానికి చెక్ పెట్టే బార్లీ నీళ్లు..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

