వాషింగ్టన్: సాధారణం కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వృద్ధుల్లో అల్జీమర్స్‌కు తొలి సంకేతమని అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. వెయ్యి మందికి పైగా వృద్ధులపై కొన్నేండ్ల పాటు పరీక్షలు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. వృద్ధులు పగటి పూట నిద్రపోయే సమయాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. వారికి ఒక పరికరాన్ని అమర్చి ఏటా పరీక్షలు నిర్వహించారు. ఎక్కువగా నిద్రపోయేవారిలో అల్జీమర్స్ లక్షణాలు కనిపించినట్టు పేర్కొన్నారు.