చెస్ శిక్షకురాలిగా అల్లు అర్హ

చెస్ బోర్డు అంటే ఏమిటో పూర్తిగా తెలియని వయసులోనే ఆ చిన్నారి ఏకంగా శిక్షకురాలైంది. కేవలం తను ఆడటం వరకే కాకుండా పది మందికి చెస్ క్రీడలో శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఈ ఘనత సాధించిందెవరో కాదు అగ్రహీరో అల్లు అర్జున్, స్నేహరెడ్డిల ముద్దుల తనయ అల్లు అర్హ. నాలుగున్నరేండ్లకే చెస్‌లో చిచ్చర పిడుగులా దూసుకుపోతూ….. తన క్రీడా నైపుణ్యాన్ని చాటుకుంటున్నది. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హైటెక్ సిటీకి చెందిన ‘రాయ్ చెస్ అకాడమీ’లో అల్లు అర్హ చదరంగం క్రీడలో శిక్షణ తీసుకుంది. వారం రోజుల్లోనే పూర్వానుభవం లేకున్నా…చదరంగంపై పట్టు సాధించింది. తను క్రీడలో నేర్చుకున్న అంశాలను వివరించడంతో పాటు తన తోటి స్నేహితులకు, ఇంట్లో పని చేసే వారికి అర్హ చదరంగంలో శిక్షణ ఇచ్చింది. గడచిన రెండు నెలలుగా అల్లు అర్హ సుమారు 50 మందికి పైగా చదరంగం క్రీడలో శిక్షణను అందించింది. చిన్నారి ప్రతిభను శిక్షకుల ద్వారా తెలుసుకున్న ప్రఖ్యాత ‘నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సంస్థ ప్రతినిధి , ఆర్బిటర్ చొక్కలింగం బాలాజీ పర్యవేక్షణలో అర్హ నైపుణ్య పరీక్షను శుక్రవారం చేపట్టారు. క్రీడలో చిన్నారి ప్రతిభతో పాటు శిక్షణను అందించే సామర్థ్యాన్ని గుర్తించి ఆ చిన్నారికి ‘నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్స్’ అవార్డును అందించింది. ఈ అవార్డును శుక్రవారం నిర్మాత అల్లు అరవింద్, అల్లు అర్జున్ – స్నేహారెడ్డి దంపతులు సహా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆర్బిటర్ బాలాజీ చిన్నారికి బహుకరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- allu arha
- Allu arjun
- Chess
- cinima
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

