దక్షిణ డిస్కమ్‌లో ‘ఉత్సవ విగ్రహాలు’
రాష్ట్రంలోని దక్షిణ డిస్కమ్ (టీజీ ఎస్పీడీసీఎల్)లో పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. ఆ డిస్కమ్‌లోని నలుగురు డైరెక్టర్లలో ముగ్గురు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారని, వారికి తమ విభాగాలపై ఎలాంటి అజమాయిషీ లేకుండా పోయిందని తెలుస్తున్నది. పూర్తిగా నాలుగో డైరెక్టరే పెత్తనం చెలాయిస్తున్నారని, అన్ని విభాగాల్లో జరిగే కీలక లావాదేవీల వివరాలను ‘మినిస్టర్ టెన్ పర్సెంట్'కు చేరవేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- డమ్మీలుగా ముగ్గురు డైరెక్టర్లు
- పరికరాల కొనుగోలు, బదిలీల్లో ఏమీ చేయలేకపోతున్న వైనం
- అన్ని విభాగాలపై నాలుగో డైరెక్టర్‌దే పెత్తనం
- ‘మినిస్టర్ టెన్ పర్సెంట్’ కోసం అక్రమాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దక్షిణ డిస్కమ్ (టీజీ ఎస్పీడీసీఎల్)లో పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. ఆ డిస్కమ్‌లోని నలుగురు డైరెక్టర్లలో ముగ్గురు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారని, వారికి తమ విభాగాలపై ఎలాంటి అజమాయిషీ లేకుండా పోయిందని తెలుస్తున్నది. పూర్తిగా నాలుగో డైరెక్టరే పెత్తనం చెలాయిస్తున్నారని, అన్ని విభాగాల్లో జరిగే కీలక లావాదేవీల వివరాలను ‘మినిస్టర్ టెన్ పర్సెంట్’కు చేరవేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ ఆరోపణలకు మంరింత బలం చేకూరుస్తున్నాయి. దీనిపై మిగిలిన ముగ్గురు డైరెక్టర్లు బయటకు చెప్పుకోలేక, లోపల దాచుకోలేక సతమతమవుతున్నారు. తమ దైన్యస్థితిని సన్నిహితులకు వివరించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీఅండ్ఎం పనులు హైజాక్
ఇటీవల జరిగిన కేబుల్, లేయింగ్ టెండర్లలో వాస్తవానికి పర్చేజ్ అండ్ మేనేజ్మెంట్ (పీఅండ్ఎం) విభాగం కీలకపాత్ర పోషించాల్సి ఉన్నది. కానీ, అలా కాకుండా ఈ వ్యవహారంలో పీఅండ్ఎం చేయాల్సిన పనులన్నీ ప్రాజెక్ట్స్ విభాగమే చేసేందుకు సీఎండీ సమావేశంలో ఓ డైరెక్టర్ అనుమతి తీసుకుని, తదనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఈ విషయంలో పీఅండ్ఎం డైరెక్టర్ ఏమీ చేయలేకపోయారు. ప్రధాన అధికారి నిర్ణయం తీసుకున్నాక తాను చేయగలిగింది ఏమున్నదని ఆ డైరెక్టర్ వాపోయినట్టు తెలిసింది. ఇటీవల చెట్ల కత్తిరింపులకు సంబంధించిన పరికరాల కొనుగోలులో కూడా పలు అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దక్షిణ డిస్కమ్‌లోని ముఖ్య అధికారికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ డైరెక్టర్ తన మిత్రుడికి సంబంధించిన స్టోర్ నుంచి ఈ పరికరాలు కొనుగోలు చేసేలా ఉత్తర్వులు ఇప్పించినట్టు తెలస్తున్నది. డివిజన్ స్థాయిలో జరిగిన ఈ వ్యవహారంలో కొన్ని వస్తువులు కొనకుండానే బిల్లులు డ్రా చేసినట్టు చర్చ జరుగుతున్నది.
అంతర్గత బదిలీల్లోనూ ఆ అధికారి చెప్పిందే వేదం
ఇటీవల దక్షిణ డిస్కమ్‌లో 40 మందికిపైగా అసిస్టెంట్ ఇంజినీర్లు, ఏడీఈల బదిలీలు జరిగాయి. అంతర్గతంగా జరిగిన ఈ బదిలీల్లో ఓ ముఖ్య అధికారి చక్రం తిప్పారు. ‘మినిస్టర్ టెన్ పర్సెంట్’తోపాటు మరో కీలక డైరెక్టర్‌తో సన్నిహిత సంబంధాలున్న ఆ అధికారి చెప్పిందే వేదమన్నట్టుగా డిస్కమ్ ముఖ్య అధికారి సైతం తలూపారని, ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారాయని మింట్ కాంపౌండ్ కోడై కూస్తున్నది. ఈ బదిలీల విషయమై సంబంధిత డైరెక్టర్‌కు చివరి నిముషం వరకు సమాచారం ఇవ్వలేదని, ఆ తర్వాత ఆ డైరెక్టర్ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తడంతో.. మీరు జోక్యం చేసుకోవద్దంటూ ముఖ్య అధికారి దబాయించినట్టు చర్చ జరుగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

