దుమ్ము రేపుతున్న మహిళా ఉద్యోగుల బతుకమ్మ పాట
తెలంగాణలో మహిళా ఉద్యోగులు కొత్త బతుకమ్మ పాటతో దుమ్ము లేపుతున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మహిళా ఉద్యోగులు కొత్త బతుకమ్మ పాటతో దుమ్ము లేపుతున్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన తీరును వర్ణిస్తూ బతుకమ్మ అడారు.
420 హామీలిచ్చి ఉయ్యాలో.. గద్దెనెకినాడే ఉయ్యాలో
ఇచ్చిన హామీలు ఉయ్యాలో.. తుంగలో తొకినాడే ఉయ్యాలో
డీఏలు రావాలంటే ఉయ్యాలో.. దసరాలు రావాలి ఉయ్యాలో
డీఏలు రావాలంటే ఉయ్యాలో.. ఎన్నికలు రావాలి ఉయ్యాలో
పీఆర్సీ రిపోర్టు ఉయ్యాలో.. తొకిపెట్టినాడే ఉయ్యాలో
ఎక్కువ మాట్లాడితే ఉయ్యాలో.. మీకు జీతాలు ఎక్వంటాడు ఉయ్యాలో
4 డీఏలంటే ఉయ్యాలో.. నాకు తెలవదంటాడు ఉయ్యాలో
సీపీఎస్ రద్దంటే ఉయ్యాలో.. ఓపీఎస్ రాదంటాడు ఉయ్యాలో
హెల్త్కార్డు అంటే ఉయ్యాలో.. మీ డబ్బులు జమ కావాలంటాడు ఉయ్యాలో
బకాయిలిమ్మంటే ఉయ్యాలో.. బాకీలున్నాయంటాడు ఉయ్యాలో
పీఆర్సీ ఇవ్వమంటేను ఉయ్యాలో.. అప్పు పుడుతలేదంటాడు ఉయ్యాలో
ఏది అడిగినా ఉయ్యాలో.. గత ప్రభుత్వమే కారణమంటాడు ఉయ్యాలో
మ్యానిఫెస్టో ఏమైంది ఉయ్యాలో.. మాయమైపోయింది ఉయ్యాలో
పోయిరావయ్యా ఉయ్యాలో.. మళ్లీ రాకయ్య ఉయ్యాలో
లేక లేక నీవొస్తే ఉయ్యాలో.. ప్రజలు ఆగమయ్యారు ఉయ్యాలో
ఉద్యోగుల ఉసురు ఉయ్యాలో.. తప్పక ముడుతాది ఉయ్యాలో
వచ్చే ఎన్నికల్లో ఉయ్యాలో.. మేమెంటో చూపిస్తాం ఉయ్యాలో
మాతో పెట్టుకున్నోడు ఉయ్యాలో.. మట్టి పాలవుతాడు ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో.. ఉద్యోగులంతా ఉయ్యాలో..
ఐక్యమైనారు ఉయ్యాలో అంటూ ఆడిపాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

