గ్రాడ్యూయేట్ ఓటరు నమోదు అంతంతే
మహబూబ్నగర్, హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఓటు హక్కు కోసం అంతంత మాత్రంగానే నమోదు జరుగుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలలోని 15 మండలాలలో ఇప్పటి వరకు 31,594 మంది పట్టభద్రులు మాత్రమే ఓటు హక్కుకు దరఖాస్తులు చేసుకున్నారు.
- మేడ్చల్ జిల్లాలో 31,594 దరఖాస్తులు
మేడ్చల్, అక్టోబర్18(నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్, హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఓటు హక్కు కోసం అంతంత మాత్రంగానే నమోదు జరుగుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలలోని 15 మండలాలలో ఇప్పటి వరకు 31,594 మంది పట్టభద్రులు మాత్రమే ఓటు హక్కుకు దరఖాస్తులు చేసుకున్నారు. పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు వచ్చే నెల నవంబర్ 6తో గడువు ముగుస్తున్నందున మరో 19 రోజులే గడువు మిగిలింది.
మహబూబ్నగర్-రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రులు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి 1,35వేల942 పట్టభద్రులు ఓటర్లు ఉండగా, ప్రస్తుతం జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి జరుగుతున్న ఓటర్ నమోదులో మాత్రం 31, 594 మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కుకు దరఖాస్తులు చేసుకోగా మరో లక్ష మంది పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు 19 రోజుల గడువులోపు చేసుకునేది ప్రశ్నార్థకంగా మారింది. పట్టభద్రులు ఓట్లు పేరగాల్సిందిపోయి తగ్గుతాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. గతంలో ఉన్న 1, 35, 942 ఓట్లకు మరో 20 వేలు పట్టభద్రుల ఓట్లు పెరుగుతాయన్న అంచనాలు తలకిందులు కానున్నాయా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సెల్ఫోన్లకు సందేశాలు..
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేలా సంబంధిత అధికారులు గతంలో ఉన్న పట్టభద్రుల ఓటర్లకు సెల్ఫోన్లకు సందేశాలను చేరవేస్తున్నారు. గత ఎన్నికల ఓటర్ జాబితాలో ఉన్న ఫోన్ల నంబర్ల ద్వారా పట్టభద్రులు నమోదు చేసుకోవాలని సందేశాలను పంపుతూ చేతులు దులుపుకొంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పట్టభద్రుల ఓటు హక్కు నమోదుపై అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రచారం చేయాల్సి ఉండగా ఎలాంటి కార్యక్రమాలను సంబంధిత అధికారులు నిర్వహించడం లేదు.
ప్రస్తుతం మూడు రోజుల బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో ఓటర్లు పండగ మూడులోకి వెళ్లిన నేపథ్యంలో ఓటరు నమోదు కార్యక్రమం మరింత మందికొడిగా సాగే అవకాశం ఉంటుందని అంచనా. ఇలానే ఎమ్మెల్సీ పట్టభద్రులు ఓటు హక్కు నమోదు కొనసాగితే గత ఎన్నికల్లో ఉన్న పట్టభద్రులు ఓట్ల కంటే త్వరలోనే జరిగే ఓటర్ జాబితాలో పట్టభద్రుల ఓట్లు తగ్గే అవకాశం ఉండే అవకాశం ఉంది. 19 రోజుల గడువు ఉన్నప్పటికీ బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా 15 రోజుల గడువు మాత్రమే ఓటు హక్కు నమోదుకు అవకాశం ఉంది. అధికారులు పూర్తి స్థాయిలో పట్టభద్రుల ఓటు హక్కు నమోదుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచిచూడాల్సిందే.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

