అట్టహాసంగా పారా ఆసియాడ్ ఆరంభం.. ప్రారంభ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా భారత బృందం
ఐదో ఎడిషన్ పారా ఆసియా క్రీడలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఆదివారం జరిగిన ఆరంభ వేడుకల్లో భారత క్రీడాకారులు దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటారు. 5 వేల ఏండ్ల నాటి మానవ నాగరికత వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక బ్లేజర్లను ధరించి మార్చ్ఫాస్ట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
నగోయా (జపాన్) : ఐదో ఎడిషన్ పారా ఆసియా క్రీడలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఆదివారం జరిగిన ఆరంభ వేడుకల్లో భారత క్రీడాకారులు దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటారు. 5 వేల ఏండ్ల నాటి మానవ నాగరికత వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక బ్లేజర్లను ధరించి మార్చ్ఫాస్ట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పారా షట్లర్ ప్రమోద్ భగత్, పారా స్ప్రింటర్ సిమ్రాన్ శర్మ త్రివర్ణ పతాకాలను చేతబూని జట్టును ముందుండి నడిపించారు.
భారత పారా అథ్లెట్లు ధరించిన అధికారిక బ్లేజర్లపై సింధు నాగరికత ముద్రలు, ప్రాచీన లిపి నమూనాలు ముద్రించారు. అలాగే కాలర్ భాగంలో సప్తసింధు నదుల ప్రాంతాన్ని స్మరిస్తూ డిజైన్ చేయగా, జేబుపై త్రివర్ణ పతాకాన్ని అలంకరించారు. ఈ క్రీడల్లో భారత్ తరఫున 11 విభాగాల్లో మొత్తం 168 మంది అథ్లెట్లు బరిలోకి దిగారు. ఈనెల 24 వరకు జరిగే ఈ మెగా గేమ్స్‌లో 45 దేశాల నుంచి సుమారు 3వేల మంది పారా అథ్లెట్లు పోటీ పడుతున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

