అల్లరి నరేష్, ఆనంది నాయకానాయికలుగా నటిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఏ ఆర్ మోహన్ దర్శకుడు. జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి బాలు మున్నంగి క్లాప్‌నివ్వగా, అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రామ్‌రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, యాక్షన్: వెంకట్.