విశ్వ కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ‘అల్లంత దూరాన’. సీనియర్ నటి ఆమని మేనకోడలు హ్రితిక ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్నది. చలపతి పువ్వుల దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో ఎన్ చంద్రమోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. హాస్య నటుడు అలీ టీజర్ ను విడుదల చేశారు. మంచి కథే స్ఫూర్తిగా సినిమాను నిర్మించామని, రెండు భాషల్లో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ -కళ్యాణ్ బోర్లగడ్డ, ఎడిటర్ – శివ కిరణ్