అలంపూర్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్త యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలుండొద్దని ఆయా శాఖ అధికారులను ఆర్డీవో రాములు ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తు ఉత్సవాలను సాంప్రదాయ పద్దతిలో, భక్తి భావంతో, ఆధ్మా త్మిక వాతావరణంలో నిర్వహించాలన్నారు. సోమవారం ఆలయంలో ఆలయ చైర్మన్, ఆలయ ఈవో అధ్యక్షతన నిర్వహిం చిన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని ఆర్డీవో చైర్మన్ రవి ప్రకాశ్‌గౌడ్‌కు, ఆలయ ధర్మకర్తలకు, ఆలయ ఈవో వీరేశంకు సూచించారు. వాహన పార్కింగ్, దర్శణ క్యూ లైన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నది దగ్గర ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రమాదాలు చోటు చేసు కోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
భక్తుల సమాచార నిమిత్తం కంట్రోల్ రూం ఏర్పాటు, భక్తులకు అందుబాటులో తాగునీటి సౌకర్యం, పరిసరాలను ఎప్పటిక పుడు శానిటేషన్ చేయడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్త యాత్రికుల కోసం ప్రత్యేక బస్సుల ఏర్పాటు, అత్యవసర చికిత్స నిమిత్తం హెల్త్ క్యాంపు ఏర్పాటు, శాంతిభద్రతల ఏర్పాట్లు, అంతరాయం లేని విద్యుత్ సరఫరా, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు.
కార్యక్రమంలో అలంపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాసీల్దార్ మదన్మోహన్ రావు, ఎంపీడీవో సుగుణకుమార్, ఆయా శాఖల అధికారులు ఆలయ సిబ్బంది, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.