జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ దగ్గర ఉన్న బందీపుర జిల్లా తులైల్ గ్రామానికి వెళ్లాడు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్. గురువారం మధ్యాహ్నం హెలికాప్టర్లో ఆ ఊరికి వెళ్లిన అక్షయ్.. అక్కడి స్థానికులు, భద్రతా బలగాలతో మాట్లాడాడు. అంతేకాదు అక్కడ ఓ స్కూలు నిర్మాణం కోసం రూ.కోటి విరాళం ఇవ్వడం విశేషం. అక్షయ్‌కుమార్ రాక అక్కడి ఆర్మీ జవాన్లు, బీఎస్ఎఫ్ బలగాల్లో ఉత్సాహం నింపింది. వాళ్లతో అక్కీ చాలా సేపు మాట్లాడాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోలను అతడు షేర్ చేశాడు. నిజమైన ఈ హీరోలను కలవడం తనకెంతో గర్వంగా ఉందని కామెంట్ చేశాడు. స్థానికులతో కలిసి అక్షయ్ డ్యాన్స్ కూడా చేశాడు.