స్వీయ దర్శకత్వంలో అజయ్ కతుర్వార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజయ్ గాడు’. అజయ్‌కుమార్ ప్రొడక్షన్స్, చందన కొప్పిశెట్టి నిర్మాతలు. ఆదివారం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ కలబోసిన ప్రేమ కథాంశమిది. తన ప్రేమను సాకారం చేసుకోవడానికి అజయ్ ఏం చేశాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా మెప్పిస్తుంది’ అని చిత్రబృందం తెలిపింది. భానుశ్రీ, శ్వేతా మోహతా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: అజయ్ కతుర్వార్.