Ajay Devgn | బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ మోస్ట్ అవేటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ చిత్రం ‘దృశ్యం 3: ది కన్క్లూజన్’ ట్రైలర్ విడుదలైంది. విజయ్ సల్గాన్కర్ పాత్రలో మరోసారి అజయ్ దేవగణ్ ప్రేక్షకులను మైమరిపించడానికి సిద్ధమయ్యారు.
గత రెండు భాగాలు సంచలన విజయం సాధించడంతో, ఈ మూడో భాగంపై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, టబు, శ్రియా శరన్, జైదీప్ అహ్లావత్, ప్రకాష్ రాజ్, రజత్ కపూర్, ఇషితా దత్తా, మృణాల్ జాదవ్, కమలేష్ సావంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సస్పెన్స్ క్రైమ్ డ్రామాను అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇక విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేస్తుంది. ఈసారైనా విజయ్ సల్గాన్కర్ పోలీసులకు చిక్కుతాడా లేదా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.