Aishwarya Rai : బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్(Aishwarya Rai Bachchan) 79వ కేన్స్ చలన చిత్రోత్సవం(Cannes Film Festival)లో తళుక్కుమంది. ప్రతిష్ఠాత్మక ఈ వేడుకలో నీలిరంగు గౌనులో ఐశ్యర్య దేవకన్యలా హొయలు పోయింది. డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన ఈ గౌనులో రెడ్ కార్పెట్ మీద ఆమె ప్రత్యక్షమవ్వగానే ఫొటోగ్రాఫర్లు కెమెరాలతో క్లిక్ మనిపించారు. ఈ ప్రపంచ సుందరి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడం 24వసారి.
ప్రపంచంలోని సుందరాంగులను ఒక్కచోట చేర్చే కేన్స్ చలన చిత్రోత్సవంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చింది. డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన నీలి రంగు గౌను ధరించిన ఐశ్వర్య.. చూపరులను తననైపు ఆకర్షించింది. రెడ్ కార్పెట్ మీదకు ఆమె రాగానే కెమెరాలు క్లిక్ శబ్దాలు హోరెత్తగా.. గాల్లోకి ముద్దులు విసురుతూ అందరికీ అభివాదం చేసింది క్వీన్. అనంతరం లవ్ సింబల్ చూపిస్తూ.. మీ ప్రేమ, అభిమానానికి ఫిదా అయ్యాను అని సంబురపడిపోయింది ఐశ్వర్య.
Make way for the Queen of Cannes!
Aishwarya Rai Bachchan’s first Cannes 2026 look is finally here
.
.
.#aishwaryarai #aishwaryaraibachchan #cannes2026#cannesfilmfestival #bollywood(Aishwarya Rai Bachchan, Cannes 2026, Bollywood ) pic.twitter.com/8OxtC5sHeP
— GlamBlitz (@GlamBlitzz) May 22, 2026
I guess neither the audience nor the cameras are blind to ignore Aishwarya Rai . Just look at the flashes .#AishwaryaRaiBachchan https://t.co/OtNuVaIrKR pic.twitter.com/qqu5KWXrC1
— God Bless Mohabbatein (@sidharth0800) May 22, 2026