SRH vs RCB : క్వాలిఫయర్ 1లో చోటు కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ వేటను మొదలెట్టింది. 256 పరుగుల భారీ ఛేదనను దూకుడుగా ఆరంభించిన ఆర్సీబీకి షాకిస్తూ హైదరాబాద్ పేసర్లు పవర్ ప్లేలో రెండు వికెట్లు తీశారు. మలింగ(1-19) ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(44)ను ఔట్ చేసి తొలి వికెట్ అందించగా.. విరాట్ కోహ్లీ(15)ని షకీబ్ హుస్సేన్ వెనక్కి పంపాడు.
ఉప్పల్ స్టేడియంలో ఇన్నింగ్స్‌ను దూకుడుగా మొదలెట్టిన ఆర్సీబీకి ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(44) అదిరే ఆరంభమిచ్చాడు. శివాంగ్ ఓవర్లో మూడు సిక్సర్లు, ఫోర్‌తో 23 పరుగులు పిండుకున్నాడు. ప్రమాదకరంగా మారిన అయ్యర్‌ను మలింగ(1-19) బోల్తా కొట్టించాడు. సిక్సర్‌కు యత్నించిన అయ్యర్ మిడాన్‌లో అభిషేక్ చేతికి చిక్కాడు. కాసేపటికే షకీబ్ ఓవర్లో కవర్స్‌లో ఆడిన విరాట్ కోహ్లీ(15) స్మరణ్ చేతికి చిక్కాడు. దాంతో. పవర్ ప్లేలో ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. కీలక వికెట్లు పడడంతో పడిక్కల్, పటిదార్ ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నారు.
Trading the V’s for the W’s 😉#SRH send both openers back in the dugout 👊
Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/7ULHdm0Rq0
— IndianPremierLeague (@IPL) May 22, 2026