KCR : బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయనపల్లి వినోద్ కుమార్ (Vinod Kumar) తమ చిన్న కుమారుడు ప్రణయ్ వివాహానికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్(KCR)ను ఆహ్వానించారు. సతీసమేతంగా శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన వినోద్ పెళ్లి పత్రికను అందజేశారు.
గులాబీ అధినేత కేసీఆర్ శోభ దంపతులకు వినోద్ – మాధవిలు ప్రణయ్ వివాహ పత్రికను అందజేసి తమ బిడ్డను ఆశీర్వదించేందుకు రావాల్సిందిగా కోరారు. డాక్టర్ రీతికతోప్రణయ్ పెళ్లి జూన్ 25వ తేదీ (గురువారం) న జరుగనుంది. ఉదయం 7.41 గంటలకు జన్వాడాలోని కే. కన్వెన్షన్ వేదికగా ప్రణయ్, రీతిక వైవాహిక జీవితంలో అడుగు పెట్టనున్నారు.