పిజ్జా ఆర్డర్ చేసి పేమెంట్ చేసిన ఏఐ ఏజెంట్
లండన్ : ఏఐ టెక్నాలజీలో మరో ముందడుగు పడింది. బ్రిటన్‌లో ఓ ఏఐ ఏజెంట్ కస్టమర్ తరఫున మినీ మార్గెరిటీ పిజ్జాలను ఆర్డర్ చేయడమే కాకుండా.. డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించి బ్యాంకు ఖాతా నుంచి పేమెంట్ చేసింది. లాయిడ్స్ బ్యాంక్, చెల్లింపుల సంస్థ ట్రూలేయర్, పిజ్జా సంస్థ పాపా జాన్స్ ఈ ప్రయోగం చేశాయి. కస్టమర్ తన ఆహార అభిరుచులను ఏఐకి వివరించగా.. అది తొమ్మిది పిజ్జాలను ఎంపిక చేసి ఆర్డర్ చేసింది. వినియోగదారుడి అనుమతి, తర్వాత బ్యాంకు ఖాతా నుంచి నేరుగా నగదు బదిలీ చేసింది. ఈ ప్రక్రియలో ఏఐకి బ్యాంక్ పాస్వర్డులు చెప్పలేదు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇక నుంచి ఆన్లైన్ షాపింగ్ మారనుంది. వస్తువులు ఆర్డర్ చేయడం, చెల్లింపులు చేయడం ఏఐ ఏజెంట్లే నిర్వహించే అవకాశం ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

