‘రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకే అగ్రి షో’
రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులు, శాస్త్రీయ పరిజ్ఞానం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడమే లక్ష్యంగా నల్లగొండలో మూడు రోజుల పాటు అగ్రి షో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు.
– 125 స్టాళ్లతో మూడు రోజుల పాటు వ్యవసాయ ప్రదర్శన
– రైతులు, పట్టణ ప్రజలు అగ్రి షోను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలి
– మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి
నల్లగొండ, నవంబర్ 12 : రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులు, శాస్త్రీయ పరిజ్ఞానం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడమే లక్ష్యంగా నల్లగొండలో మూడు రోజుల పాటు అగ్రి షో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో నిర్వహించే అగ్రి షోను రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల వారు, పట్టణ ప్రజలు సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురువారం నల్లగొండలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, బండ శ్రీశైలం, ఎండీ హషం, పాలడుగు నాగార్జునతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరిగే అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలు, 41వ జీఎం కన్వెన్షన్లలో భాగంగా అగ్రిషో ఏర్పాటు చేసినట్లు వివరించారు.
125 స్టాళ్లు.. ఆధునిక పరికరాల ప్రదర్శన
ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అగ్రిషోను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు. మొత్తం 125 స్టాళ్లను ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వ్యవసాయానికి ఉపయోగపడే డ్రోన్లు, ట్రాక్టర్లు, ఆధునిక యంత్రాలు, నూతన విత్తనాలు, ఎరువులు, డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు, వివిధ సాగునీటి పద్ధతులను ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రతినిధులు రైతులకు పంటల సాగు, చీడపీడల నివారణ, పంటల తెగుళ్లపై సలహాలు, సూచనలు అందిస్తారని తెలిపారు.
నీటి కొరతను అధిగమించే సాంకేతికతపై ప్రత్యేక దృష్టి
ప్రస్తుతం వ్యవసాయ రంగంలో నీటి కొరత ప్రధాన సమస్యగా మారిందని, అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని సమర్థంగా వినియోగించుకునే సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రిప్‌తో పాటు స్ప్రింక్లర్లు, జెట్, ఇతర సూక్ష్మ సాగునీటి పద్ధతులను ప్రదర్శనలో చూపించనున్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 15 వేల ఎకరాల్లో సాగవుతున్న పామాయిల్ పంటకు నీటి సమస్య పరిష్కార మార్గాలను వివరించేందుకు పామాయిల్ కంపెనీలు, పతంజలి సంస్థల స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
శాస్త్రవేత్తలతో నేరుగా సందేహాల నివృత్తి
రైతులకు అవసరమైన సమాచారం, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు రుణ సదుపాయాలపై అవగాహన కల్పించేందుకు సీసీ బ్యాంకు స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నర్సరీలు, హెర్బల్, ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించిన స్టాళ్లు కూడా ఉంటాయని వెల్లడించారు. రైతులు తమ పంటల సమస్యలను శాస్త్రవేత్తలకు వివరించి తగిన సూచనలు పొందడంతో పాటు అవసరమైన పరికరాలు, విత్తనాలను పరిశీలించి కొనుగోలు చేయవచ్చన్నారు. ఈ సమావేశంలో రాము నాయక్, ఎండి సలీం, వెంకట్ రెడ్డి, పుచ్చకాయ నర్సిరెడ్డి, నలపరాజు సైదులు, కొండ వెంకన్న, పి.సత్యనారాయణ, కొండ వెంకన్న, వి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకే అగ్రి షో’
Gold Price | ఒకేరోజు రూ.1400 తగ్గిన బంగారం ధర.. 1.86 లక్షలకు దిగొచ్చిన వెండి..!
Alias Rukmini | టాలీవుడ్ హీరో నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్ పూర్తి.. డిసెంబర్ 4న గ్రాండ్ రిలీజ్!
Aldas Janaiah | అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్డాస్ జానయ్యపై విచారణకు గవర్నర్ ఆదేశాలు
Arvind Kejriwal: 7 కోట్లు ఇవ్వండి.. కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

