Arvind Kejriwal: 7 కోట్లు ఇవ్వండి.. కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు
Arvind Kejriwal: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు బెదిరింపులు వచ్చాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసినట్లు తిలక్ నగర్ ఎమ్మెల్యే జార్నైల్ సింగ్ తన ఫిర్యాదులో తెలిపారు. ఏడు కోట్లు ఇవ్వాలని ఫోన్‌కాల్‌తో పాటు వాట్సాప్‌లో మెసేజ్ వచ్చిందన్నారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు బెదిరింపులు వచ్చాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఫోన్ వచ్చినట్లు తెలిసింది. ఏడు కోట్లు చెల్లించాలంటూ ఓ వ్యక్తి డిమాండ్ చేశాడు. తిలక్ నగర్ ఎమ్మెల్యే జార్నైల్ సింగ్ నవంబర్ 6వ తేదీన తన ఫిర్యాదులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు ఆ ఎమ్మెల్యే తెలిపారు. ఒకవేళ డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకుంటే, ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌తో పాటు ఆమె కూతుర్ని హతమార్చనున్నట్లు ఆ వ్యక్తి పేర్కొన్నారని ఎమ్మెల్యే చెప్పారు. బీఎన్ఎస్, ఐటీ చట్టం ప్రకారం మొహాలీ పోలీసులు కేసును రిజిస్టర్ చేశారు. సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఈ కేసును విచారిస్తున్నారు. అనుమానిత ఫోన్ కాల్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేజ్రీవాల్, ఆయన కుమార్తె హర్షితా కేజ్రీవాల్‌కు ప్రత్యేక భద్రత కల్పించాలని ఎమ్మెల్యే జార్నైల్ సింగ్ డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arvind Kejriwal: 7 కోట్లు ఇవ్వండి.. కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు
మోటకొండూర్ మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం
Jagga Reddy | సోనియాగాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా : జగ్గారెడ్డి
Kiara Advani | ‘టాక్సిక్’ రిజల్ట్ నన్ను కుంగదీసింది : కియారా అద్వానీ
Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

