హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ)/ కవాడిగూడ: సమాజం కోసం త్యాగానికి పాల్పడే విద్యార్థి లోకాన్ని రెచ్చగొడితే పరిణామాలు విపరీతంగా ఉంటాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సామాజిక బాధ్యతను తమ బాధ్యతగా భావించే విద్యార్థులకు సమస్య ఎదురైతే సహించేది లేదని స్పష్టంచేశారు. చారిత్రాత్మక 1969 ఉద్యమాన్ని నడిపింది విద్యార్థి లోకమనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష సమయంలో ఢిల్లీ సర్కార్ మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో ప్రధాన భూమిక పోషించింది విద్యార్థి లోకమేనని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలనే ప్రభుత్వ కుట్రలను విరమించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మంగళవారం ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీల వెంకటేశ్, అనంతయ్య అధ్యక్షతన జరిగిన ఈ సత్యాగ్రహ దీక్షలో సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, వీ జీ ఆర్ నారగోని తదితర బీసీ సంఘాల నాయకులు పాల్గొని మద్దతు పలికారు. సిరికొండ మధుసూదనాచారి నిమ్మరసం ఇచ్చి కృష్ణయ్య దీక్షను విరమింపజేశారు.
మాజీమంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేయాలని చూస్తున్నదని ఆరోపించారు. ఈ నిర్ణయంతో బలహీనవర్గాల విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని వాపోయారు. ప్రభుత్వం మెడలు వంచి ఫీజు రీయింబర్స్మెంట్ సాధించుకొనేలా పోరా టం చేయాలని విద్యార్థులకు పిలుపు ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ర్టాన్ని దోచుకుంటుందని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌తో సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ఈ పథకాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ కుట్రలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, లేకుంటే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. సత్యాగ్రహదీక్షలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పగిళ్ల సతీశ్, సీ రాజేందర్, గొరిగెమల్లేశ్ రాంకోటి, శివకుమార్, మోదీ రాందేవ్, జిల్లపల్లి అంజి తదితర బీసీ కుల సంఘాల నేతలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.