AFG vs PAK | పాక్ ఔట్‌పోస్టుపై బాంబు జారవిడిచిన ఆఫ్ఘన్ డ్రోన్.. Video
AFG vs PAK | కాబూల్ (Kabul) లో పేలుళ్లకు ప్రతీకారంగా పాకిస్థాన్ (Pakistan) పై ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) ప్రతిదాడులకు దిగింది. ఆఫ్ఘన్ తాలిబన్లు (Taibans) డ్రోన్లతో పాకిస్థాన్ ఔట్‌పోస్టులపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పలువురు పాక్ సైనికులు మరణించారు.
AFG vs PAK : కాబూల్ (Kabul) లో పేలుళ్లకు ప్రతీకారంగా పాకిస్థాన్ (Pakistan) పై ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) ప్రతిదాడులకు దిగింది. ఆఫ్ఘన్ తాలిబన్లు (Taibans) డ్రోన్లతో పాకిస్థాన్ ఔట్‌పోస్టులపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పలువురు పాక్ సైనికులు మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. ఈ ఘర్షణలతో ఆఫ్ఘన్ తాలిబన్లకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.
అయితే పాకిస్థాన్ ఔట్‌పోస్టులపై దాడులకు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ వీడియో ఫుటేజీని ఆఫ్ఘన్ తాలిబన్లు విడుదల చేశారు. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఓ నిర్మాణంపై ఆఫ్ఘన్ తాలిబన్లు డ్రోన్ సాయంతో బాంబును జారవిడిచిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ దీర్ఘచతురస్రాకార నిర్మాణం పాకిస్థాన్‌కు చెందిన ఔట్‌పోస్టుగా తాలిబన్లు చెబుతున్నారు.
డ్రోన్ నుంచి జారవిడిచిన బాంబు ఆ నిర్మాణంపై పడిన కొన్ని క్షణాల్లోనే పేలుడు సంభవించినట్లు స్పష్టంగా కనిపించింది. ఆ దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
Afghan Taliban claims they used drones to target Pakistani border outposts. Dozens of Pakistani soldiers have been killed or are missing as of now. Deadliest clashes between Pakistan and Afghanistan in years. pic.twitter.com/Ig4raLRnVl
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 15, 2025
కాగా కాబూల్‌లోని తెహ్రిక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ (TTP) స్థావరాలపై గత వారం పాక్ సైన్యం దాడిచేసింది. అయితే తాము టీటీపీకి ఆశ్రయం ఇవ్వడం లేదని, పాకిస్థాన్ ఆరోపణల్లో నిజం లేదని ఆఫ్ఘనిస్థాన్ కొట్టిపారేసింది. కాబూల్‌పై దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఔట్‌పోస్టులపై తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. దాంతో రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఖతార్, సౌదీ మధ్యవర్తిత్వం ద్వారా సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతుండగానే తాజాగా మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. మంగళవారం రాత్రి నుంచి సరిహద్దుల్లో రెండు దేశాల సైనికుల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో రెండు వైపుల నుంచి డజన్ల మంది సైనికులు మరణించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

