న్యూఢిల్లీ: ప్రీ డయాబెటిస్ గల వయోజనులు ప్రతి రోజూ ఒక మామిడి పండును తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణ మెరుగుపడుతుంది. జార్జి మేసన్ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో ఈ ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడయ్యాయి. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఆరు నెలలపాటు ప్రతి రోజూ మామిడి పండు తినేవారిని ఒక గ్రూపుగా, తక్కువ షుగర్ గల స్నాక్స్‌ను తినేవారిని రెండో గ్రూపుగా విభజించారు. వీరందరి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, ఇన్సులిన్ రెస్పాన్స్, బాడీ కంపోజిషన్లను ట్రాక్ చేశారు.
తక్కువ షుగర్ కంటెంట్ గల ప్రత్యామ్నాయాలను తిన్నవారితో పోల్చినపుడు, రోజుకు ఒక మామిడి పండు చొప్పున తిన్నవారిలో ైగ్లెసెమిక్ కంట్రోల్ మెరుగుపడింది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి శరీరంలో కొవ్వు తగ్గింది. దీనిని బట్టి కేవలం సుగర్ కంటెంట్ మాత్రమే ముఖ్యం కాదని, సంపూర్ణ ఆహారపు మొత్తం పోషక విలువలు ముఖ్యమని తెలిసింది. మామిడి పండ్లలో సహజంగా కనిపించే షుగర్‌లో ఫైబర్, విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. శరీరంపై సుగర్ చూపే ప్రభావాన్ని తగ్గించడంలో ఇవి దోహదపడతాయి.