చెన్నై: కరూర్ బహిరంగ సభ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడి, చికిత్స పొందుతున్నవారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు.
విశ్రాంత న్యాయమూర్తి అరుణ జగదీశన్ నేతృత్వంలోని కమిషన్ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. సహాయ కార్యక్రమాలను సమన్వయపరిచేందుకు కరూర్కు వెళ్లాలని తిరుచ్చి, సేలం, దిండిగల్ జిల్లాల కలెక్టర్లను స్టాలిన్ ఆదేశించారు.