సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పుడూ ఏదో ఒక వీడియోతో ఫాలోవర్లను పలుకరిస్తుంటుంది ముంబై భామ ఆదాశర్మ. తాజాగా ఈ భామ నయా అవతారంలో కనిపిస్తూ సందడి చేస్తుంది. హాఫ్ శారీలో ఉన్న ఆదాశర్మ సముద్రతీరంలోని రాళ్లపై కర్రలతో విన్యాసాలు చేస్తున్న వీడియోను శివమ్ సాంగ్ బ్యాక్ డ్రాప్ తో ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. మీరు ఏదైనా కావొచ్చు. కొన్నిసార్లు సాధారణ విశ్వాసం శాంతికి దారి తీస్తుంది. ఓ నమః శివాయ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమైన ఆదాశర్మ మళ్లీ ఇక్కడి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. తాను ఐదు తెలుగు సినిమాలకు సంతకం చేశానని ఇటీవలే చెప్పుకొచ్చింది ఆదా.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.