పూర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్యాక్‌డోర్’. కర్రి బాలాజీ దర్శకుడు. బి.శ్రీనివాస్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 25న విడుదలకానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటి జీవితరాజశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘మానవ సంబంధాల్లోని చీకటి కోణాల్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన థ్రిల్లర్ చిత్రమిది. పూర్ణ పాత్ర చిత్రణ భిన్న పార్శాల్లో సాగుతుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అంశాలుంటాయి’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: శ్రీకాంత్ నారోజ్, సంగీతం: ప్రణవ్, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ.