ముంబై: బాలీవుడ్ హీరో, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ తన గ్యారేజీలోకి కొత్త కారును తెచ్చేసుకున్నాడు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 కారును ఆయన ఖరీదు చేశారు. 5.0 లీటర్ల V8 ఇంజిన్ ఉన్న ఆ ఎస్యూవీ కారు ఖరీదు 2.05 కోట్లు. న్యూ జనరేషన్ మోడల్ తరహాలో ఈ కొత్త కారు ఉంది. ఆఫ్ రోడ్‌లోనూ ఇది దుమ్మురేపుతుంది. ఇది జీరో నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.2 సెకన్లలో అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 240. ఫైవ్ సీటర్ రూపంలో డిఫెండర్‌ను రూపొందించారు. ఈ కారు బరువు సుమారు మూడు వేల కేజీలు ఉంటుంది. ఆఫ్ రోడ్ లగ్జరీ కారుగా దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు.