నార్నూర్ : గిరిజన విద్యార్థులపై(Tribal Students ) నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పేందోర్ సంతోష్ ( President Santosh) , జై భారత్ జిల్లా కోఆర్డినేటర్ పేందోర్ దీపక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల ఎదుట మీడియాతో మాట్లాడారు.
నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో విఫలం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కేజీబీవీలో అన్నంలో పురుగులు ఉండడంతో విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయాన్ని గమనించి పాఠశాలకు వెళితే అనుమతులు లేకుండా పాఠశాలకు ఎలా వస్తారు అంటూ జీసీడీవో ఉదయ్ శ్రీ నిలదీయడం శోచనీయమని ఆరోపించారు. వారి వెంట నాయకులు మెస్రం మానిక్ రావు, ఆడ శ్రీరామ్, రాథోడ్ భిక్షపతి, మాజీ సర్పంచ్ ఆత్రం పరమేశ్వర్, అర్క గోవింద్, మోతిరామ్ తదితరులున్నారు.