తాండూర్ : భార్యను చంపిన కేసులో ( Murder Case) నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ ( Remand ) చేసినట్లు తాండూర్ సర్కిల్ సీఐ కే కుమారస్వామి తెలిపారు. తాండూర్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కన్నెపల్లి మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన ముడిమడుగుల తిరుపతికి 14 ఏళ్ల క్రితం దహెగాం మండలం బామన్ నగర్ గ్రామానికి చెందిన తులసితో వివాహం జరిగింది. వారికి నాలుగు సంవత్సరాల గ్రీష్మ అనే కూతురు ఉంది. అయితే తన భార్యకు వేరే ఆక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్యతో తరచూ గొడవపడుతూ మద్యానికి బానిసయ్యాడు . గురువారం తెల్లవారుజామున దంపతులిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో తిరుపతి తన భార్య తులసిని గొడ్డలితో నరికి చంపేశాడు.
మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం నిందితుడు తిరుపతిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో కన్నెపల్లి ఎస్సై గంగారాం, పోలీసు సిబ్బంది ఉన్నారు.