విద్యా ఉద్యోగ సమాచారం

విదేశీ విద్యానిధి దరఖాస్తు గడువు 30
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకానికి ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016 నుంచి ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్టు పేర్కొన్నారు. వివరాలకు https://telanganaepass.cgg.gov.in/లో చూడాలని సూచించారు.
రేపటి నుంచి డీఈఈ సెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈ సెట్ రెండోవిడత కౌన్సెలింగ్ గురువారం నుంచి ప్రారంభంకానున్నది. ఈ మేరకు సెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 25 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్, 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశమిచ్చారు. డిసెంబర్ 3న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు డిసెంబర్ 6, 7 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్‌చేయాలి. 10న ైస్లెడింగ్ ద్వారా కాలేజీలను మార్చుకొనే అవకాశం. ైస్లెడింగ్లో సీటు పొందినవారు డిసెంబర్ 11 నుంచి 14 వరకు కాలేజీల్లో రిపోర్టుచేయాలి.
తెలుగు వర్సిటీలో 26, 27 తేదీల్లో కౌన్సెలింగ్
తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 23: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం యూజీ, పీజీ కోర్సులకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 26, 27 తేదీల్లో నాంపల్లిలోని వర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రవేశాల కమిటీ సంచాలకుడు డాక్టర్ కోట్ల హనుమంతరావు మంగళవారం తెలిపారు. అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతోపాటు రిజర్వేషన్ పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. 26న బీఎఫ్ఏ, ఎంఏ (జ్యోతిషం, చరిత్ర, సంస్కృతి, టూరిజం) కోర్సులకు, 27న ఎంఏ (తెలుగు, జర్నలిజం) కోర్సులకు కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.
ఇంటర్ కరోనా ప్రత్యేక పరీక్షలు రద్దు
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించబోమని ఇంటర్‌బోర్డు అధికారులు స్పష్టంచేశారు. ఇలాంటివారు ఎవరూ లేకపోవడంతో ప్రత్యేక పరీక్షను రద్దుచేసినట్టు తెలిపారు. గత నెలలో ఇంటర్ సెకండియర్లోని విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షలను నిర్వహించారు. కరోనా బారినపడ్డ విద్యార్థులను పరీక్షకు అనమతించమని, వారికి ప్రత్యేక ఎగ్జామ్స్ పెడతామని అప్పట్లో ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ఇలాంటి వారు తమను సంప్రదించాలని తెలిపింది. పరీక్షలు ముగిశాయి. ఈ నెలాఖరున ఫలితాలు రానున్నాయి. కొవిడ్ బారినపడ్డ విద్యార్థులెవరూ ప్రత్యేక పరీక్ష కోసం తమను సంప్రదించనందున ప్రత్యేక పరీక్ష నిర్వహించబోమని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. ఇటీవలి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కు కూడా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుపబోమని చెప్పారు.
గిరిజన లా పట్టభద్రులకు నైపుణ్యశిక్షణ
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): గిరిజన నిరుద్యోగ న్యాయవాద పట్టభద్రులకు వృత్తి నైపుణ్యశిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. నెలకు రూ.1000 ైస్టెఫండ్తోపాటు పుస్తకాలు, ఫర్నిచర్ కొనుగోలు కోసం రూ.6000 చెల్లిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30లోపు ఐటీడీఏ, పీవో కార్యాలయంలో లేదా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆ శాఖ మంగళవారం కోరింది.
14 నుంచి పీజీ డిప్లొమా పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 23: ఓయూ పరిధిలోని పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్, పీజీ డిప్లొమా ఇన్ జాగ్రఫికల్ కార్టోగ్రఫీ తదితర కోర్సుల పరీక్షలను వచ్చేనెల 14 నుంచి నిర్వహించనున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీనగేశ్ మంగళవారం తెలిపారు. వివరాలను www.osmania.ac.in చూడాలని సూచించారు.
ఉచిత పుస్తకాల ముద్రణకు టెండర్లు
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఉచితంగా అందించాల్సిన కోటిన్నర పాఠ్యపుస్తకాల ముద్రణకు ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణ సంస్థ అధికారులు మంగళవారం టెండర్ల నోటిఫికేషన్ విడుదలచేశారు. టెండర్ల దాఖలుకు బుధవారం నుంచి డిసెంబర్ 8 వరకు గడువు విధించారు. కోటిన్నర పుస్తకాల్లో 50 లక్షల పుస్తకాలను మాత్రమే ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణ సంస్థలో ప్రింటింగ్ చేయనున్నారు. మిగతా కోటి పుస్తకాలను ప్రైవేట్ పబ్లిషర్ల ద్వారా సేకరించనున్నారు. టెండర్ల దాఖలు పూర్తికాగానే టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లను పూర్తిచేసి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ముద్రణను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
12న ఎన్టీఆర్ ‘గెస్ట్’ స్కాలర్షిప్ టెస్ట్
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఎన్టీఆర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ (గెస్ట్) డిసెంబర్ 12న నిర్వహించనున్నట్టు ఎన్టీఆర్ ట్రస్ట్‌వర్గాలు మంగళవారం తెలిపాయి. టెస్ట్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన 25 మంది బాలికలకు మెరిట్ స్కాలర్‌షిప్స్‌ను అందజేస్తామని, టాప్‌టెన్‌లో నిలిచిన విద్యార్థులకు నెలకు రూ.5 వేలు, తదుపరి 15 మంది బాలికలకు నెలకు రూ.3 వేల చొప్పున రెండేండ్లపాటు అందజేస్తామని పేర్కొన్నాయి. విద్యార్థులు డిసెంబర్ 8వ తేదీలోగా www.ntrtrust.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 76600 02627/28 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలని కోరాయి.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా: జేఎన్టీయూ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ హైదరాబాద్‌లో పార్ట్‌టైమ్ పీహెచ్డీ ప్రాగ్రామ్ 2020-21లో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25న నిర్వహించాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ వాయిదా వేసినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ మంగళవారం తెలిపారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ చూడాలని పేర్కొన్నారు.
నీట్ రాష్ట్ర ర్యాంకుల్లోనూ శ్రీచైతన్యదే హవా
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): నీట్ రాష్ట్ర టాప్ ర్యాంకుల్లోనూ, మొత్తం ర్యాంకుల్లోనూ తమ సంస్థ తిరుగులేని ఆధిపత్యం కనబర్చినట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్-డైరెక్టర్ సుష్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ టాప్ టెన్లోపు ఎనిమిది ర్యాంకులు తమ విద్యార్థులే సాధించారని పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపకులను శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు అభినందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Academic
- job information
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

