Aaryavir Sehwag : మాజీ క్రికెటర్లు కుమారులు వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటున్నారు. రాహుల్ ద్రవిడ్ వారసులు జూనియర్ స్థాయిలో రాణిస్తుండగా.. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్(Aaryavir Sehwag) సైతం చెలరేగిపోతున్నాడు. అంతేనా.. అచ్చం తన తండ్రిలా బ్యాటింగ్ నైపుణ్యం కనబరుస్తూ అందర్నీ అలరిస్తున్నాడు. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆర్యవీర్ షాట్ ఆడాడు. ఆ షాట్ చూసినవాళ్లంతా సెహ్వాగ్‌ను గుర్తు చేశాడని మురిసిపోయారు.
విధ్వంసక ఓపెనర్‌గా బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇప్పుడు అతడి వారసుడు ఆర్యవీర్ సెహ్వాగ్ సైతం అలానే చెలరేగిపోతున్నాడు. భయమన్నదే ఎరుగకుండా వీరూ ఆడే పలు షాట్లను ఇతడూ ఆడేస్తుననాడు. ఇటీవల ఢిల్లీ ప్రీమయర్ లీగ్‌లో ఈ కుర్రాడు.. అచ్చం తన తండ్రిలా ఆడాడు. వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్యవీర్ స్క్వేర్ డ్రైవ్, కవర్ డ్రైవ్‌లతో సెహ్వాగ్‌ను గుర్తు చేశాడు. శనివారం సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌తో మ్యాచ్‌లో అతడు.. కళాత్మక షాట్లతో అలరించాడు. 233 పరుగుల ఛేదనలో వెస్ట్ ఢిల్లీ పోరాడినా 21 పరుగుల తేడాతో ఓడింది. అయితే.. ఆర్యవీర్ ఆటమాత్రం అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది.
Virender Sehwag 🤝 Aaryavir Sehwag.
Like Father, Like Son… 🔥 pic.twitter.com/pNDY0db6KB
— CricketGully (@thecricketgully) August 21, 2026
నజఫర్గఢ్ నవాబ్‌గా పేరొందిన సెహ్వాగ్ 1999లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేశాడు. దూకుడై మంత్రగా బౌలర్లపై విరుచుకుపడిన వీరూ 374 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో మొట్టమొదటి త్రిశతకం బాదిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కిన సెహ్వాగ్.. వన్డేల్లోనూ డబుల్ సెంచరీ సాధించాడు. మొత్తంగా మూడు ఫార్మాట్లలో 38 శతకాలు, 72 అర్ధ శతకాలతో కలిపి 17,253 పరుగులు సాధించాడీ డాషింగ్ బ్యాటర్.