Sitaare Zameen Par | బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. 2007లో విడుదలై సంచలనం సృష్టించిన ‘తారే జమీన్ పార్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్ 2’తో పాటు విడుదల చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘సితారే జమీన్ పర్’ ట్రైలర్‌ను వచ్చే నెల మే 1, 2025న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ ట్రైలర్‌కు UA సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. ఈ ట్రైలర్ దాదాపు 3 నిమిషాల 29 సెకన్ల నిడివితో ఉండనుంది.
ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దర్శీల్ సఫారీతో పాటు జెనీలియా దేశ్‌ముఖ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘సితారే జమీన్ పర్’ అనేది స్పానిష్ భాషలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘కాంపియోన్స్’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
కాగా, అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్ 2’ చిత్రం మే 1న విడుదల కానుండటంతో, ఈ సినిమా యొక్క థియేట్రికల్ ప్రింట్లకు ‘సితారే జమీన్ పర్’ ట్రైలర్‌ను జతచేసి విడుదల చేయనున్నారు. తద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు ఈ చిత్రం గురించి తెలియజేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.