రేవంత్‌రెడ్డి మెప్పుకోసమే ‘ఆది’ విమర్శలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పు కోసమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తరచూ విమర్శలు చేస్తున్నాడని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు విమర్శించారు.
- నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు ఫైర్
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పు కోసమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తరచూ విమర్శలు చేస్తున్నాడని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు విమర్శించారు. విషయం ఉన్నా లేకున్నా కేటీఆర్‌ను విమర్శిస్తూ రేవంత్‌రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి విప్ నానా ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
మూసీ నది సుందరీకరణకు తొందర ఎందుకని, ఇప్పుడు రైతులు కష్టాల్లో ఉన్నారని కేటీఆర్ సూచించడంలో తప్పేమున్నదని అడిగారు. మూసీ నది కోసం రూ.7వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్లకు టెండర్లు పిలిచారని, ఇవే డబ్బులు కరువులో ఉన్న రైతులు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుందని కేటీఆర్ చెప్తే అర్థం చేసుకోవాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగడం శోచనీయమని అన్నారు. ‘వేములవాడ నియోజకవర్గంలోనే కరువు ఉన్నదని, నీకు ఓటేసిన వేములవాడ నియోజకవర్గ ప్రజలను చూసుకోవాలి’ అని ఆది శ్రీనివాస్‌కు హితవు పలికారు. తోట ఆగయ్య మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శించే స్థాయి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు లేదని ధ్వజమెత్తారు. వేములవాడ నియోజకవర్గంలో కరువు ఉన్న విషయం విప్‌నకు కనిపిస్తలేదా? అని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

