Aadi Shambhala | ఎప్పుడూ వైవిధ్యమైన కథలతో వచ్చే ఆది సాయికుమార్, ఈసారి ఒక విభిన్నమైన మిస్టరీ యాక్షన్ డ్రామాతో మన ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆది శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి మిస్టికల్ ట్రైలర్ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. పురాతన రహస్యాలు, ఆధ్యాత్మిక అంశాలు మరియు హై-వోల్టేజ్ యాక్షన్తో ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
ఆకాశం నుంచి ఒక ఉల్క లాంటి రాయి కిందికి వచ్చి ఒక ఊరిలో పడుతుంది. అయితే అది పడిన తర్వాత నుంచి ఆ ఊరిలో ప్రజలు వింతగా ప్రవర్తిస్తుంటారు. అయితే దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి.. ఆ రహస్యాన్ని కనుగొని ప్రజలను హీరో ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా కథ. ఆది సాయికుమార్ ఈ చిత్రంలో భౌగోళిక శాస్త్రవేత్తగా ఓ ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్లో అర్చన అయ్యర్, స్వాసిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.