కటక్: ఒడిశాలో దారుణం జరిగింది. ఓ యువకుడి చేతుల్ని తాడుతో కట్టేసి.. అతన్ని స్కూటర్‌తో లాక్కెళ్లారు. ఈ ఘటన కటక్‌లో జరిగింది. నగరంలో బిజీగా ఉండే రోడ్డుపై అతన్ని రెండు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు.
ఈ ఘటనకు చెందిన సమాచారం తమకు రాత్రి 11 గంటలకు అందినట్లు కటక్ డీసీపీ పినాక్ మిశ్రా తెలిపారు. నిందితుల్ని, బాధితుడిని గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.
బాధితుడిని జగన్నాథ్ బెహరాగా గుర్తించారు. అతను నిందితుడి వద్ద నుంచి 1500 అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అనుకున్న సమయానికి డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాడతను. దీంతో నిందితుడిని స్కూటర్‌కు కట్టేసి రెండు కిలోమీటర్ల దూరం లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.