Murder | వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (Varanasi)కి చెందిన 20, 22లోపు వయసు ఉన్న ఓ యువతి నీట్‌కు ప్రిపేరవుతూ ఎమ్మెస్సీ చదువుతుంది. ఆగస్టు 18న కాలేజీకి అని ఇంటినుంచి వెళ్లి, ఆ తర్వాత కనిపించుకుండాపోయింది. మూడు రోజుల తరువాత కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆమె మృతదేహం ఆమె బాయ్ ఫ్రెండ్ వివేక్ చౌబే ఉంటున్న గదిలోని బాత్రూంలో కనిపించింది. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు గొంతు కోయడం వల్లే ఆమె మరణించిందని నిర్ధారించారు. తలపై తీవ్ర గాయాలు, కాళ్లు కట్టేసి ఉన్నాయి. ఆమెపై అత్యాచారం కూడా జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
కాలేజీకి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు బంధువుల దగ్గర వాకబు చేసిన అనంతరం పోలీసుల (Police)ను ఆశ్రయించారు. వారు ఆమె ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయగా వారణాసిలో ఉన్న మాలవీయ ఇంటర్ కాలేజీ లొకేషన్ చూపించింది. ఆమె తల్లి, మరో బంధువు మీర్జాపూర్ జిల్లాలోని సీఖర్ గ్రామంలో ఉన్న నిందితుడు వివేక్ చౌబే మేనమామ ఇంట్లో ఆమె బ్యాంగ్ దొరికింది. దీనిలో ఒక తాళం చెవి ఉండగా, అది తీసుకుని నిందితుడి గదికి వెళ్ల వెతకగా బాత్రూంలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. నిందితుడు వివేక్ చౌబే పరారీలో ఉన్నాడని సీనియర్ పోలీసాఫీసర్ నీతూ కడ్యాన్ వెల్లడించారు.
పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఇప్పటివరకు నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా నిందితుడు చౌబే మా కూతురిని కొన్ని రోజులుగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వేరే ఎవరినయినా పెళ్లి చేసుకుంటే ఆమె పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోను తన ఫొటో కలిపి ఎడిట్ చేసిన ఫొటోను వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని వెల్లడించారు.
ఆమె వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న వేరే యువకుడితో కుదిర్చారు. దీంతో అప్పటి నుంచి అతడు ఆ కుటుంబంపై కోపం పెంచుకున్నాడు. ఆమె ప్రిపేర్ అవుతున్న నీట్ పరీక్ష కోసం సహాయం చేస్తానని నమ్మించి ఆమెను ఆగస్టు 18న తను ఉంటున్న గదికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్న సీసీ టీవీ పనిచేయడం లేదని పోలీసులు గుర్తించారు. ఇదంతా సాక్ష్యాలను తారుమారు చేయడానికి లేదా అతడికి ఎవరు సహకరించారో తెలియకుండా ఉండేందుకు ఇలా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థి ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం వారు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు రాజకీయంలో ప్రవేశించేందుకు (political-aspirant) ప్రయత్నిస్తున్నాడని, సొంత కుటుంబ సభ్యులతో గొడవలు ఉండటంతో మూడేండ్లుగా చౌబే తన మేనమామ ఇంట్లో నివసిస్తున్నాడు. మేనమామతో కూడా తగాదాలు ఉన్నాయని తెలిసింది. నిందితుడు తన స్వగ్రామమైన నియార్దిహ్లో గ్రామ ప్రధాన్ ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తేలింది.