న్యూఢిల్లీ : సంజయ్ దత్ ఆడిపాడిన ప్యార్ ఆగయా రే సాంగ్‌కు స్టైలిష్ మూమెంట్స్‌తో డ్యాన్స్ చేసిన బాలిక వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. స్కూల్ యూనిఫాంలో చిన్నారి ఇచ్చిన స్వీట్ పెర్ఫామెన్స్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఆర్జ్-ఇ-ఇష్క్ అనే పేజ్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది. 26 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో బాలిక స్కూల్ బస్ నుంచి కిందకు దిగి ప్యార్ ఆగయా రే సాంగ్‌కు హుషారైన స్టెప్స్ వేసింది.
This is beautiful ❤ pic.twitter.com/tRpVJyXDJi
— Aarz-e-ishq (@Aarzaai_Ishq) January 2, 2023
మ్యూజిక్కు అనుగుణంగా ఆమె డ్యాన్స్ మూమెంట్స్ సరైన సమన్వయంతో కుదరడం నెటిజన్లను ఆకర్షించింది. ఈజ్‌తో కిల్లర్ మూమెంట్స్ ఇవ్వడంతో పాటు బాలిక ఎక్స్ప్రెషన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ వీడియోను ఇప్పటివరకూ 20,000 మందికిపైగా వీక్షించారు.
2000 సంవత్సరంలో విడుదలైన కురుక్షేత్ర మూవీలోని ప్యార్ ఆగయా రే సాంగ్‌ను అల్కా యాగ్నిక్, కుమార్ సాను హృద్యంగా ఆలపించారు. ఈ పాటకు బాలిక స్టెప్స్‌ను యూజర్లు ఫిదా అయ్యారు. ఆమె పెర్ఫామెన్స్ నెక్ట్స్ లెవెల్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, బాలిక కాబోయే స్టార్ అని మరో యూజర్ కొనియాడారు.