e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News ఉష్ణం,కాంతిని నిరంతరం వెదజల్లే నక్షత్రం?

ఉష్ణం,కాంతిని నిరంతరం వెదజల్లే నక్షత్రం?

నక్షత్రాలు-సౌరకుటుంబం

 • అనేక వేల కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ‘గెలాక్సీ’ అని అంటారు. సూర్యుడు అనేది ఒక నక్షత్రం. ‘పాలపుంత లేదా ఆకాశ గంగ’ అనే గెలాక్సీకి చెందింది.
 • వేల కోట్ల గెలాక్సీలు కలిసి ‘విశ్వం’ అంటారు.
 • విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని ‘కాస్మాలజీ’ అంటారు.
 • భూమిపై నిట్టనిలువుగా ఉన్న వస్తువుకు ఏర్పడే నీడల్లో అతి తక్కువ పొడవు గల నీడ ఉత్తర, దక్షిణ దిశల్లో ఏర్పడుతుంది.
 • ప్రాంతీయ మధ్యాహ్న వేళలో వస్తువుకు అతి తక్కువ పొడవు గల నీడ ఏర్పడుతుంది.
 • ప్రాంతీయ మధ్యాహ్న వేళనే ‘లోకల్‌ నూన్‌ టైం’ అంటారు.
 • తెలుగు రాష్ర్టాల్లోని ఏకైక నీడ గడియారం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో గల ‘అన్నవరం’ లోని సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉంది.
 • చంద్రుని ఆకారం ప్రతిరోజూ మారుతూ ఉండటం, ఈ మార్పులను చంద్రకళలు అంటారు. ఒక ప్రదేశంలో కనిపించే చంద్రుడు మళ్లీ అదే ప్రదేశంలో కనిపించడానికి ఒక రోజు కంటే దాదాపు 50 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. ఇదే చంద్రకళలు ఏర్పడటానికి కారణం.
 • అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు భూమికి ఒకేవైపున ఉంటాయి. పౌర్ణమి రోజున సూర్యుడు, చంద్రుడు భూమికి చెరోవైపున ఉంటాయి.
 • చంద్రుడి ఉపరితలం దుమ్ముధూళితోను ఎటువంటి జీవం లేకుండా ఉంది. అనేక లోయలు, పర్వతాలు ఉన్నాయి.
 • 2008, అక్టోబర్‌ 22న భారతదేశం చంద్రుడి గురించి పరిశోధనలకు చంద్రయాన్‌-1ను ప్రయోగించారు.

దీని ముఖ్య విధులు..
1) చంద్రునిపై నీటి జాడ వెతకడం
2) చంద్రుడిపై పదార్థ మూలకాలను తెలుసుకోవడం
3) హీలియం-3ని వెతకడం
4) చంద్రుడి త్రిమితీయ (3D) అట్లాస్‌ తయారు చేయడం
5) సౌరవ్యవస్థ ఆవిర్భావానికి గల ఆధారాలు వెతకడం

- Advertisement -

చంద్రుడి నీడ భూమిపై పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
ఇది అమావాస్య రోజున ఏర్పడుతుంది.

ఇది నాలుగు రకాలు..

1) సంపూర్ణ సూర్యగ్రహణం
2) పాక్షిక సూర్యగ్రహణం
3) వలయాకార సూర్యగ్రహణం
4) మిశ్రమ సూర్యగ్రహణం

వలయాకార గ్రహణం సంపూర్ణ గ్రహణంగా మారడం అరుదుగా సంభవిస్తుంది.
భూమి నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
ఇది పౌర్ణమి రోజు సంభవిస్తుంది. ఇది మూడు రకాలు

1) సంపూర్ణ చంద్రగ్రహణం
2) పాక్షిక చంద్రగ్రహణం
3) ప్రచ్ఛాయ/ఉపఛాయ చంద్రగ్రహణం

 • భూమి నీడ అంచుల్లో ఉండే పలుచని నీడ ప్రాంతం చంద్రుడిపై పడటం వల్ల ప్రచ్ఛాయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
 • సంపూర్ణ సూర్యగ్రహణం 1980, ఫిబ్రవరి 16న ఏర్పడింది.
 • ఏపీలోని కృష్ణా జిల్లాలో కొన్ని ప్రదేశాల్లో కనిపించింది.
 • భూమి స్థానంతో పోలిస్తే స్థానభ్రంశం చెందకుండా స్థిరంగా ఉండే నక్షత్రాన్ని ‘ధృవ నక్షత్రం’ అంటారు.
 • దీనిని ఇంగ్లిష్‌లో ‘పొలారిస్‌’ అంటారు. ఇది భూమికి ఉత్తర ధృవానికి ఎదురుగా ఉంది.
 • ధృవ నక్షత్రాన్ని ‘సప్తర్షిమండలం’ సహాయంతో తెలుసుకోవచ్చు.
 • ధృవ నక్షత్రం చుట్టూ మిగిలిన నక్షత్రాలన్నీ ఒక చుట్టు తిరిగిరావడానికి 24 గంటలు సమయం పడుతుంది.
 • ధృవ నక్షత్రం భూభ్రమణాక్షంపై ఉంది. కాబట్టి స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

సౌరకుటుంబం
సూర్యుడు, దాని చుట్టూ తిరిగే అంతరిక్ష వస్తువులన్నింటిని కలిపి సౌర కుటుంబం అని అంటారు. దీనిలో గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, ఆస్టరాయిడ్స్‌ వంటివి ఉంటాయి.

సూర్యుడు
మనకు దగ్గరలోని నక్షత్రం. ఇది అత్యంత ఉష్ణం, కాంతిని నిరంతరం వెదజల్లుతుంది.
భూమిపై ఉన్న వివిధ ఉపగ్రహాలపై ఉన్న శక్తిరూపాలకు సూర్యుడు ప్రధాన వనరు.

గ్రహాలు
ఇవి నక్షత్రాల వలే కనిపిస్తాయి. కానీ వీటికి స్వయం ప్రకాశక శక్తి ఉండదు. ఇవి తమపై పడిన కాంతిని పరావర్తనం చేస్తాయి.
ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ ప్రత్యేక మార్గంలో పరిభ్రమిస్తుంది. దీనిని కక్ష్య అంటారు.
ఒక గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలం పరిభ్రమణ కాలం.
సూర్యుడి నుంచి గ్రహాల కున్న దూరం పెరుగుతున్న కొద్ది వాటి పరిభ్రమణ కాలం పెరుగుతుంది.
గ్రహాలు తమ చుట్టూ తాము తిరగడాన్ని ‘భ్రమణ కాలం’ అంటారు.
ఏ అంతరిక్ష వస్తువయినా మరొక దాని చుట్టూ తిరుగుతూ ఉంటే దానిని ఉపగ్రహం అంటారు.
చంద్రుడు భూమికి ఉపగ్రహం, మానవ నిర్మిత ఉపగ్రహాలను ‘కృత్రిమ ఉపగ్రహాలు’ అంటారు.

బుధుడు
సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. అతి చిన్న గ్రహం. దీనికి ఉపగ్రహాలు లేవు.
దీని పరిభ్రమణ కాలం 83 రోజులు

శుక్రుడు

 • భూమికి దగ్గరగా ఉన్న గ్రహం. ఆకాశంలో కనిపించే గ్రహాల్లో ప్రకాశవంతమైంది.
 • దీనిని వేగుచుక్క, సాయంకాల చుక్క అని పిలుస్తారు.
 • ఇది అపసవ్య దిశ (తూర్పు నుంచి పడమరకు) తిరుగుతుంది.
 • దీనికి ఉపగ్రహాలు లేవు.
 • దీని పరిభ్రమణ కాలం 225 రోజులు.
 • సౌరకుటుంబంలోని గ్రహాలన్నింటిలోకి జీవరాశి కలిగి ఉన్న గ్రహం.
 • అంతరిక్షం నుంచి చూసినప్పుడు నీలి ఆకుపచ్చ రంగుతో కనిపిస్తుంది. కారణం నేల, చెట్లు, నీటి వల్ల కాంతి వక్రీభవనం.
 • దీనికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు దీని పరిభ్రమణ కాలం 365 రోజులు.

కుజుడు/అంగారకుడు

 • ఇది భూ కక్ష్యకు బయటి వైపు ఉన్న మొదటి గ్రహం
 • కొద్దిగా ఎరుపురంగులో ఉండటం వల్ల దీనిని ‘అరుణ గ్రహం’ అని పిలుస్తారు.
 • దీనికి ఉపగ్రహాల సంఖ్య- 2
 • దీని పరిభ్రమణ కాలం- 687 రోజులు

శని

 • ఇది పసుపు వర్ణంలో కనిపిస్తుంది.
 • దీని చుట్టూ వలయాలు ఉంటాయి.
 • దీనికి గల ఉపగ్రహాల సంఖ్య- 53
 • దీని పరిభ్రమణ కాలం- 29.5 సంవత్సరాలు. దీని ఉపగ్రహం టైటాన్‌. ఇది భూమిని పోలి ఉంటుంది.

యురేనస్‌

 • దీనిని టెలిస్కోప్‌ సాయంతో మాత్రమే చూడగలం. ఇది శుక్ర గ్రహం వలే తూర్పు నుంచి పడమరకు పరిభ్రమిస్తుంది.
 • దీని అక్షం అత్యధికంగా వంగి ఉంటుంది.
 • దీని ఉపగ్రహాల సంఖ్య- 27. పరిభ్రమణ కాలం 24 సంవత్సరాలు.

నెప్ట్యూన్‌

 • సూర్యుడికి అత్యంత దూరంలో ఉంటుంది.
 • దీని ఉపగ్రహాల సంఖ్య- 13
 • దీని పరిభ్రమణ కాలం- 165 సంవత్సరాలు
 • గ్రహాలు రెండు రకాలు. 1) అంతర గ్రహాలు (బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు) 2) బాహ్య గ్రహాలు (బృహస్పతి, శని, యురేనస్‌, నెప్ట్యూన్‌)
 • సూర్యుడి వ్యాసం- 13,92,000 కి.మీ.
 • భూమి వ్యాసం 12756 కి.మీ.
 • చంద్రుడి వ్యాసం- 3474 కి.మీ.
 • భూమికి, చంద్రుడికి మధ్య దూరం- 3,84,399 కి.మీ.
 • భూమికి, సూర్యుడికి మధ్య దూరం- 15 కోట్ల కి.మీ.
 • 2006, ఆగస్ట్‌ 25న ప్లూటోను గ్రహం కాదని నిర్ణయించారు. కారణం ‘Clear the Neighborhood’ అనే నియమాన్ని ఉల్లంఘించడం.
 • క్లియర్‌ ది నైబర్‌హుడ్‌ అంటే తోటి గ్రహాల కక్ష్యలకు ఆటంకం కలిగించరాదు.

ఆస్టరాయిడ్స్‌

 • చిన్న చిన్న గ్రహ శకలాలను ‘ఆస్టరాయిడ్స్‌’ అని అంటారు. ఇవి కుజుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్నాయి.
 • వీటిని టెలిస్కోప్‌ సహాయంతో మాత్రమే చూడగలం.

తోక చుక్కలు

 • ఇవి సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్త కక్ష్యలో పరిభ్రమిస్తుంటాయి.
 • వీటి పరిభ్రమణ కాలం చాలా ఎక్కువ.
 • తోక చుక్క సూర్యుడిని సమీపిస్తున్న కొద్ది దాని తోక పొడవు పెరుగుతుంది. దీని తోక ఎల్లప్పుడూ సూర్యునికి వ్యతిరేక దిశలో ఉంటుంది.
 • హేలీ తోక చుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. 1988లో కనిపించింది. మళ్లీ 2062లో కనిపిస్తుంది.
 • షూమాకర్‌ లెవీ-IX అనే తోక చుక్క 1984లో బృహస్పతిని ఢీకొట్టింది.

ఉల్కలు-ఉల్కాపాతాలు

 • అంతరిక్షం నుంచి జారిపడే ఖనిజాలను ‘ఉల్కలు’ అంటారు.
 • ఇవి భూ వాతావరణంలోకి ఎక్కువ వేగంతో ప్రవేశిస్తాయి.
 • ఇవి గాలితో ఉండే ఘర్షణ వల్ల బాగా వేడెక్కి మండుతాయి.
 • ఇవి భూమిని చేరి పెద్ద గొయ్యిని ఏర్పరుస్తాయి. దీనిని ఉల్కాపాతం అంటారు.
 • సౌర కుటుంబం ఏయే పదార్థాలతో ఏర్పడిందో తెలుసుకోవడానికి ఉల్కాపాతం ఉపయోగపడుతుంది.
 • మనం ఏ సాధనం లేకుండా 3000 నక్షత్రాలను చూడగలం.
 • టెలిస్కోప్‌ సహాయంతో వేల మిలియన్ల నక్షత్రాలను చూడగలం.
 • అనేక నక్షత్రాల సముదాయాన్ని ‘నక్షత్ర మండలాలు’ అంటారు.
 • ప్రస్తుతానికి 88 నక్షత్ర మండలాలను గుర్తించారు. ఉదా: ఒరియన్‌, కరోనా బొరియాలిస్‌, ఆర్సామైనర్‌, ఆర్సామేజర్‌
 • సప్తర్షి మండలం
 • దీనిని ఇంగ్లిష్‌లో Great Bear అని పిలుస్తారు.ఇది నాగలి ఆకారంలో ఉంటుంది.
 • ఇది ఏడు నక్షత్రాల సముదాయం.
 • శర్మిష్ట రాశి లో ఆరు నక్షత్రాలు ఉంటాయి.
 • ఇది ‘m’ ఆకారంలో ఉంటుంది.

ఎక్లిప్టిక్‌

 • ఒక సంవత్సర కాలంలో నక్షత్రాల మధ్య సూర్యుడు ప్రయాణించే మార్గాన్ని ఎక్లిప్టిక్‌ (Ecliptic) అని అంటారు.
 • దీనికి దగ్గరగా ఉండే బెల్టు వంటి ఆకారాన్ని ‘రాశి చక్రం’ అని అంటారు.
 • ఈ రాశి చక్రంలోని 12 నక్షత్ర మండలాలకు 12 పేర్లు పెట్టారు. వీటిని రాశి గుర్తులు అని అంటారు.

1) మేశం- ఏరిస్‌
2) వృషభం- టారస్‌
3) మిథునం- జెమిని
4) కర్కాటకం- క్యాన్సర్‌
5) సింహం- లియో
6) కన్య- వర్గో
7) తుల- లిబ్రా
8) వృశ్చికం- స్కార్పియో
9) ధనస్సు- సజీటారియస్‌
10) మకరం- కాప్రికార్న్‌
11) కుంభం- అక్వేరియస్‌
12) మీనం- పిసెస్‌

కృత్రిమ ఉపగ్రహాలు

 • మానవ నిర్మిత ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలు అంటారు.
 • భారత్‌ మొదటగా ప్రయోగించిన ఉపగ్రహం- ఆర్యభట్ట
 • INSAT, IRS, కల్పన-1, ఎడ్యుశాట్‌ వంటివి భారత్‌ ప్రయోగించిన ఉపగ్రహాలు.
 • వాతావరణ అధ్యయనానికి, రేడియో, టెలివిజన్‌ ప్రసారాలకు, టెలీకమ్యూనికేషన్‌ రిమోట్‌ సెన్సింగ్‌ (నిర్ణీత దూరంలో ఉండి సమాచారం సేకరించడం), వైమానిక, సైనిక కార్యకలాపాలకు ఉపగ్రహాలను ఉపయోగిస్తారు.

అంతరిక్ష విజ్ఞానంలో తొలిసారి జరిగిన సంఘటనలు

 • మొట్టమొదటిసారిగా రష్యా 1957, అక్టోబర్‌ 4న స్పుత్నిక్‌-1 అనే తొలి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీంతో అంతరిక్ష యుగం ప్రారంభమైందని చెప్పవచ్చు.
 • స్పుత్నిక్‌-1 వ్యాసం- 23 అంగుళాలు, బరువు- 184 పౌండ్లు
 • ఇది భూమి చుట్టూ 1440 సార్లు పరిభ్రమించి 1958, జనవరి 4న భూ వాతావరణంలోకి ప్రవేశించి పేలిపోయింది.
 • 1957, నవంబర్‌ 3న స్పుత్నిక్‌-2 ద్వారా ‘లైకా’ అనే కుక్కను రష్యా అంతరిక్షంలోకి పంపింది.
 • అమెరికా తమ తొలి కృత్రిమ ఉపగ్రహం ‘ఎక్స్‌ప్లోరర్‌-1’ను 1958, జనవరి 31న ప్రయోగించింది.
 • దీని ద్వారా అంతరిక్ష వయస్సు, భూమి అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేశారు.
 • అమెరికా 1959లో షామ్‌ (SHAM) అనే కోతిని అంతరిక్షంలోకి పంపింది.
 • 1961, ఏప్రిల్‌ 12న రష్యాకు చెందిన కల్నల్‌ యూరి గగారిన్‌, వొస్తోక్‌-1 అనే అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షంలో భూమి చుట్టూ ఒకసారి 89.34 నిమిషాల్లో పరిభ్రమించి ప్రథమ అంతరిక్ష వ్యోమగామిగా రికార్డులకెక్కాడు.
 • 2011 నుంచి ఐక్యరాజ్యసమితి ఏప్రిల్‌ 12ను ‘ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌’గా నిర్వహిస్తుంది.
 • అంతరిక్ష యానం చేసిన తొలి మహిళా వ్యోమగామి లెఫ్టినెంట్‌ కల్నల్‌ వాలెంటినా తెరిష్కోవా (రష్యా).
 • ఈమె 1963, జూన్‌ 16న వొస్తోక్‌-16 అంతరిక్ష నౌకలో ఇతర వ్యోమగాములతో కలిసి రెండురోజుల 22 గంటల 42 నిమిషాల్లో భూమి చుట్టూ 48 సార్లు ప్రదక్షిణం చేసింది.
 • అమెరికాకు చెందిన తొలి మహిళా వ్యోమగామి స్యాలి రైడ్‌ 1983, జూన్‌ 13న చాలెంజర్‌లో అంతరిక్షయానం చేశారు. 2012, జూలై 23న క్యాన్సర్‌తో మరణించారు.
 • 1965, మార్చిలో ‘అలెక్సి లియనోవ్‌’ అనే అతడు వొస్తోక్‌-2 స్పేస్‌ నౌక ద్వారా రోదసిలోకి వెళ్లి అంతరిక్షంలో కొద్దిసేపు నడిచాడు.
 • 1965, జూన్‌ 3న జెమిని-4 అంతరిక్ష నౌక ద్వారా అమెరికన్‌ వ్యోమగామి ఎడ్వర్డ్‌ హెచ్‌ వైట్‌ అంతరిక్ష నౌక నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా 21 నిమిషాలు తేలియాడాడు.

గురుడు/బృహస్పతి

 • సౌర కుటుంబంలోకెల్లా అతిపెద్ద గ్రహం
 • భూమి కంటే 1300 రెట్లు పెద్దది. దీని ద్రవ్యరాశి భూ ద్రవ్యరాశికి 318 రెట్లు.
 • ఇది తర చుట్టూ తాను అతివేగంగా తిరుగుతుంది.
 • దీనికి గల ఉపగ్రహాల సంఖ్య- 50
 • దీని పరిభ్రమణ కాలం- 12 సంవత్సరాలు. అదిపెద్ద ఉపగ్రహం- గనిమెడ

ఎన్‌. స్రవంతి
విషయ నిపుణులు
ఏకేఆర్‌ స్టడీ సర్కిల్‌, వికారాబాద్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement