
అప్పుడే పుట్టిన బిడ్డను వదిలించుకున్నది ఓ తల్లి. ఈ అమానవీయ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. ఠాణా పక్కన గల దారిలో అరుపులు వినిపించగా పోలీసు సిబ్బంది అటుగా వెళ్లి చూడగా ఏడుస్తున్న ఓ పసిపాప కనిపించింది. వెంటనే ఆ చిన్నారిని పోతుగల్ పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి పాప ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. అనంతరం ఆ శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.